Anupama: రేటు పెంచిన అనుపమ ?

అనుపమ పరమేశ్వరన్ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “అ ఆ” సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోయింది. తనదైన అందం, నటన, అభినయంతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇప్పటివరకు ఎలాంటి బోల్డ్ సీన్స్ లో నటించని ఈ బ్యూటీ తాజాగా “టిల్లు స్క్వేర్” లో బోల్డ్ సీన్స్ లో నటించి రొమాన్స్ తో పిచ్చెక్కిస్తోంది ఈ భామ. మొన్నటికి మొన్న అనుపమ నటించిన “రౌడీ బాయ్స్” సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది.

ఆ సినిమాలో అనుపమను చూసి చాలామంది అనుపమనేనా అసలు ఇలాంటి సీన్స్ చేసింది అని షాక్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ అనుపమ “టిల్లు స్క్వేర్” సినిమాలోను అంతకుమించి అదే సీన్స్ ను రిపీట్ చేసింది. “డీజే టిల్లు” సినిమాలో రాధిక పాత్రలో నేహా శెట్టి చాలా హాట్ గా కనిపించింది. ఆ సినిమా విజయంలో రాధిక కీలకపాత్ర పోషించింది. ఇక ఇప్పుడు “డిజె టిల్లు” సినిమాకు సీక్వెల్ గా వస్తున్న “టిల్లు స్క్వేర్” లో రాధికా లేదు. రాధిక పాత్రలో అనుపమ వచ్చింది. అయితే అనుపమ కూడా హాట్ నెస్ లో ఏమాత్రం తగ్గలేదు. ఇక “టిల్లు స్క్వేర్” సినిమాలో అనుపమ హాట్ నెస్ తో పాటు టిల్లు కామెడీ ప్లస్ పాయింట్ అయింది.

ఇక ఈ సినిమాలో అనుపమ ట్రెండీ కాస్ట్యూమ్స్, కారులో లిప్ లాక్ సీన్లు చూసి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుపమకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అనుపమ ఏం చేసినా తెగ వైరల్ అయిపోతుంది. ఇక ఈ సినిమాలో అనుపమ లిప్ లాక్ సీన్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ల కోసం ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ తీసుకుందట అనుపమ. ఒక కోటి రూపాయలు తన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా వసూలు చేస్తోందట. కాగా, అనుపమ లాంటి హాట్ బ్యూటీ ఇలాంటి సీన్లు చేయడంతో అభిమానులు వాటిని వైరల్ చేస్తున్నారు. అనుపమ ఇలాంటి సీన్లలో నటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తోంది. ఇక రాబోయే రోజుల్లో అనుపమ మరేన్ని సర్ప్రైజ్ లు ఇస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు