Anupama Parameshwaran: యంగ్ హీరోలతో మాత్రమే అను రొమాన్స్… సీనియర్ హీరోలకు నో ఛాన్స్

Anupama Parameshwaran

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. బోల్డ్ ఇమేజ్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటిదాకా కేవలం హోమ్లీ రోల్స్ కే పరిమితమైన ఈ అమ్మడు ఇప్పుడు రూట్ మార్చి బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. “టిల్లు స్క్వేర్” సినిమాలో హద్దులు లేకుండా ముద్దు సన్నివేశాల్లో నటించి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. నిజానికి ఇప్పటిదాకా కనీసం ఈ అమ్మడు స్కిన్ షో చేయడానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆమె రెచ్చిపోయి నటించిన విధానం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. అయితే ఈ రొమాంటిక్ సీన్లకు కూడా కొన్ని కండిషన్స్ పెడుతోంది అనుపమ.

ముఖ్యంగా తనతో రొమాన్స్ చేసే ఛాన్స్ ను కేవలం కుర్ర హీరోలకు మాత్రమే ఇస్తోంది ఈ మలయాళ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోలకు నో ఛాన్స్… అంటోంది. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా నటించిన “రౌడీ బాయ్స్” సినిమాతో గ్లామర్ హద్దులు చెరిపేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపమ మొదటిసారిగా లిప్ లాక్ సన్నివేశాలు చేసి షాక్ ఇచ్చింది.

అయితే “రౌడీ బాయ్స్” ఆమెను టాక్ ఆఫ్ ది టౌన్ అయితే చేయగలిగింది. కానీ, బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా కోసం ఆమె గీత దాటి ముద్దు సీన్లలో కనిపించినప్పటికీ, ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. అయినప్పటికీ నిరాశ పడకుండా ఇది కేవలం శాంపిల్ మాత్రమే, ముందు ముందు చూపిస్తాను అసలు రొమాన్స్ ఏంటో అన్నట్టుగా “టిల్లు స్క్వేర్” సినిమాలో ఎవ్వరూ ఊహించని విధంగా రెచ్చిపోయి మరీ నటించింది.

- Advertisement -

సిద్దు జొన్నలగడ్డతో “టిల్లు స్క్వేర్” సినిమాలో ఆమె చేసిన డీప్ లిప్ లాక్ సీన్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ దెబ్బతో ఆమెకు ఇప్పటిదాకా ఉన్న హోమ్లీ ఇమేజ్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. అయితే తాను పడ్డ కష్టం ఈసారైనా ఫలించినట్టేనా అంటే మార్చి 29న రిలీజ్ అయ్యే “టిల్లు స్క్వేర్” సినిమాతో తేలిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే అనుపమ ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేయడానికి కేవలం కుర్ర హీరోలను మాత్రమే ఎంచుకుంటుంది.

గతంలో ఆశిష్, ఇప్పుడేమో సిద్దు జొన్నలగడ్డ. అంతకుముందు, రీసెంట్ గా ఆమె పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. కానీ ఒక్కరితో కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించలేదు. ముఖ్యంగా తాజాగా రిలీజ్ అయిన రవితేజ “ఈగల్” సినిమాలో అనుపమ హీరోయిన్ అయినప్పటికీ, ఒక్క సీన్ లో కూడా గ్లామర్ షో చేయకపోవడం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు