Tillu Square Trailer : ఈ బోల్డ్ స్టెప్ అనుపమకు బ్లాక్ బస్టర్ తెచ్చినట్టేనా?

Anupama parameswaran

గ్లామర్ తో సంబంధం లేకుండా ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియుల మనసులో మంచి స్థానం సంపాదించుకున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ముఖ్యంగా అసలు ఏమాత్రం గ్లామర్ వలకబోయకుండానే ఈ అమ్మడికి యూత్ ఫిదా అయిపోయారు. అయితే ఇదంతా ఇప్పటిదాకా జరిగిన కథ. ఇప్పటి నుంచి అనుపమ అంటే ఆమె రెచ్చిపోయి చేసిన కిస్ సీన్లే గుర్తుకు వస్తాయి. తాజాగా రిలీజ్ అయిన “టిల్లు స్క్వేర్” ట్రైలర్ చూస్తుంటే ఆమె అభిమానుల గుండె తరుక్కుపోతోంది. తన నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ అను ఫాన్స్ తెగ బాధ పడిపోతున్నారు. మరి ఈ బోల్డ్ స్టెప్ తోనైనా అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందా?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ “టిల్లు స్క్వేర్”. 2022లో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “డీజే టిల్లు” మూవీకి సీక్వెల్ గా “టిల్లు స్క్వేర్” రాబోతోంది. మల్లిక్ రాం దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై బజ్ క్రియేట్ కాగా, తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన “టిల్లు స్క్వేర్” ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

- Advertisement -

ఈ ట్రైలర్ లో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మధ్య ఉన్న ఘాటు లిప్ లాక్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇప్పటిదాకా సాంప్రదాయబద్దంగా, పద్ధతిగా కనిపించిన అనుపమ ఒక్కసారిగా లిప్ లాక్ తో రెచ్చిపోవడం షాకింగ్ గా మారింది. మొత్తానికి ఈ కిస్ సీన్ ట్రైలర్ కి హైలైట్ గా మారిపోగా, అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళ లిప్ సీన్ తెగ వైరల్ అవుతుంది.

అయితే ఆ ట్రైలర్ ను చూసిన అనుపమ అభిమానులు మాత్రం దారుణంగా హర్ట్ అయ్యారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేక, ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పోటీని తట్టుకోలేక అనుపమ ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే యాక్టింగ్ పరంగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ గ్లామర్ పరంగా వాళ్లకు గట్టి పోటీని ఇచ్చి, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేసులోకి దూసుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ డేరింగ్ స్టెప్ వేసిందని అంటున్నారు. మరి మార్చ్ 29న రిలీజ్ కాబోతున్న “టిల్లు స్క్వేర్” అయినా అనుపమ కెరీర్ ను మలుపు తిప్పుతుందా అనేది వేచి చూడాలి.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు