Tollywood: టాలీవుడ్ ని కబ్జా చేస్తున్న తమిళ తంబీలు..!

ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ వచ్చాక సినిమాకి లాంగ్వేజ్, ఏరియా లాంటి బేరియర్స్ లేకుండా పోయాయి. ప్రేక్షకులకు కథ నచ్చాలే గానీ, భాషతో సంబంధం లేకుండా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ మలయాళం కన్నడ సినిమా అన్న తేడా లేకుండా ఏ సినిమా అయినా ఓటీటీలో చూసేస్తున్న రోజులు ప్రస్తుతం వచ్చాయి. మరో పక్క టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిన నేపథ్యంలో మన డైరెక్టర్స్, హీరోలతో పని చేయడం కోసం ఇతర ఇండస్ట్రీ టెక్నీషియన్స్, నటులు క్యూ కడుతుంటే మ్యూజిక్ డైరెక్టర్స్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా తయారయ్యింది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ పాన్ ఇండియా సినిమాలకు మ్యూజిక్ ఇవ్వటం పక్కన పెడితే, మన తెలుగు సినిమాల విషయంలో కూడా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ డామినేట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న అరడజనుకి పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ తమిళ్ వాళ్ళే అవ్వటం చర్చనీయాంశం అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల డైరెక్షన్లో రూపొందుతున్న దేవర సినిమాకు, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రానున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, టైగర్ నాగేశ్వరరావు, ఆదికేశవ సినిమాలతో సహా ‘నితిన్ – వెంకీ కుడుముల’, దుల్కర్ సల్మాన్ – వెంకీ అట్లూరి’ సినిమాలకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా, చందు మొండేటి నాగచైతన్య కాంబినేషన్లో రానున్న సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, విశ్వక్ సేన్ VS11 సినిమాకు యువన్ శంకర్ రాజా, నితిన్ 32, నాగశౌర్య 24 సినిమాలకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

మొత్తానికి ఆ రకంగా తమిళ తంబీలు టాలీవుడ్ పై తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. అయితే, ఇప్పటిదాకా రీమేక్ సినిమాలకు డబ్బింగ్ సినిమాలకు మాత్రమే తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ అందించిన మ్యూజిక్ క్లిక్ అయ్యింది కానీ స్ట్రైట్ సినిమాలకు సక్సెస్ రేట్ తక్కువే అని చెప్పచ్చు. మరి తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ కి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడైనా ప్లస్ అవుతారా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు