Thalapaty Vijay: లియో నుండి బిగ్ అప్డేట్..!

లోకేష్ కనగరాజ్, తలపతి విజయ్ కాంబినేషన్లో లియో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విజయ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందంటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అక్టోబర్ 19న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండే హై రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. విక్రమ్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ ఈ సినిమాను అంతకు మించిన రేంజ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి పాన్ ఇండియా ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచటంలో లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

విజయ్, లోకేష్ ల కాంబోలో గతంలో వచ్చిన మాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో లియో సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పచ్చు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఫాస్ట్ పార్ట్ ఖైదీ, సెకండ్ పార్ట్ విక్రమ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కాబట్టి లియోలో ఆ రెండు సినిమాలకు సంబందించిన కనెక్షన్ ఎలా చూపించబోతున్నాడు అన్న ఆసక్తి నెలకొంది. మరి, మోస్ట్ క్రేజీయెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ఉన్న లియో ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు