Srimukhi: పెళ్ళి పై ఇంట్లో ఒత్తిడి.. శ్రీముఖి క్రేజీ కామెంట్స్ వైరల్..!

తెలుగు బుల్లితెరపై అత్యధికంగా అభిమానులను సొంతం చేసుకోవడమే కాదు వరుస షో లతో బిజీగా ఉన్న యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి.. సుమా కంటే కూడా ఎక్కువ షోలు చేస్తూ మరింత బిజీగా మారిన ఈమె.. ఒకప్పుడు ఒక్కో షో కే పరిమితమైంది .. కానీ ఇప్పుడు ఈమె క్రేజ్ చూసి ప్రతి ఛానల్ కూడా అవకాశం ఇస్తూ ఉండడంతో ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకూడదని అన్ని షోలలో పాల్గొంటూ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటోంది. ఒకవైపు టీవీ షో లు చేస్తూనే మరొకవైపు స్పెషల్ షోలు చేస్తూ.. అలాగే వెండితెర పై కూడా పలు రకాల క్యారెక్టర్లలో కనిపిస్తూ బాగా క్యాష్ కూడా చేసుకుంటోంది. తన మాటలతో అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి వయసు 30 యేళ్లు..

దీంతో ఏజ్ పెరుగుతోందని అయినా పెళ్లి చేసుకోవడం లేదేంటని అభిమానులు కూడా ఎన్నోసార్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు.అయితే ఎప్పటికప్పుడు తాను కెరియర్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో పెళ్లి గురించి ఆలోచన రాలేదని. గతంలో లవర్ ఉన్నారంటూ ఒక ప్రచారం కూడా జరిగింది.. అయితే బ్రేకప్ అయ్యిందనే విషయాన్ని కూడా ఒక షోలో తెలియజేసింది..ఇందులో నిజం ఉందా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు.. ఇటీవల చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు కూడా వివాహ బంధం లోకి అడుగుపెడుతున్నారు.

అలాగే సినిమా హీరో , హీరోయిన్స్ కూడా వివాహాలు చేసుకుంటూ ఉండగా.. శ్రీముఖి మాత్రం మ్యారేజ్ గురించి ఇప్పటివరకు మాట్లాడడం లేదు.. తాజాగా శ్రీముఖికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వడంతో ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.. పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది..తనకు వయసు పెరుగుతూ ఉండడంతో.. పెళ్లి కి సంబంధించిన పలు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.. తమ ఇంట్లో పేరెంట్స్ కూడా పెళ్లిపైన ప్రెజర్ చేస్తున్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు.. కానీ తమ తల్లిదండ్రులు తనపైన ఎలాంటి ఒత్తిడి తేలేదంటూ తెలిపింది..

- Advertisement -

అంతేకాదు శ్రీముఖి తన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కూడా అభిమానులతో పంచుకుంది.నువ్వు షో లు చేస్తున్నావు కదా నీ రంగంలో నువ్వు ముందుకు వెళుతున్నావు.. అలాగే ముందుకు వెళ్ళు.. నీకు చేసుకోవాలనుకున్నప్పుడే వివాహం చేసుకో.. మేము బలవంతం పెట్టమని కూడా శ్రీముఖి తో చెప్పారట. అలా తల్లిదండ్రులు కూడా తన పెళ్లి విషయంలో ఫ్రీడం ఇచ్చారని.. కానీ మీడియా వారు మాత్రం తనను ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారని శ్రీముఖి తెలియజేసింది. ప్రస్తుతం యాంకర్ గా బిజీగా ఉన్నానని.. ఇప్పుడైతే వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని.. తాను ఏ విధంగా మాట్లాడుతానో మీకు తెలుసని.. ఒకవేళ పెళ్లి కోసం రెడీగా ఉన్నప్పుడు అంతే గట్టిగా అరుస్తూ ప్రకటిస్తానని కూడా వెల్లడించింది శ్రీముఖి.. ప్రస్తుతానికైతే ఇప్పుడు వివాహం చేసుకునే ఆలోచనలో లేనని క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా మరిన్ని అవకాశాలు అందుకుంటూ బిజీగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు