Srimukhi : ఇంకెన్ని సార్లు పెళ్లి చేస్తారు?

బుల్లితెర రాములమ్మగా తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతోంది శ్రీముఖి. ఏ ఛానల్ చూసిన, ఏ షో చూసినా తనదే అన్నట్లుగా హల్చల్ చేస్తోంది. ఫలితంగా ప్రేక్షకులకు నిత్యం టచ్ లో ఉంటూనే తన రేంజ్ ను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీముఖి, అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ బాగా హైలైట్ అవుతుంది. బుల్లితెర రాములమ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న శ్రీముఖి, వరుసగా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు పలు ఎంటర్టైన్మెంట్ షోలకి యాంకర్ గా వ్యవహరిస్తూ, ఇంకొక వైపు గ్లామర్ షో తో యువతను పిచ్చెక్కిస్తోంది.

ఇది ఇలా ఉండగా, శ్రీముఖిపై గత కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. శ్రీముఖి ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ ఈ వార్తల సారాంశం.అయితే కొన్ని రోజుల నుంచి వస్తున్న పెళ్లి వార్తలపై శ్రీముఖి స్పందించింది. ఈ సందర్భంగా గాసిప్ రాయుళ్లకు వార్నింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ.

‘అదంతా ఫేక్, ఎంత దారుణంగా తయారయ్యారు అంటే నా తండ్రి ఫోటోను బ్లర్ చేసి అతడినే పెళ్లి చేసుకోబోతున్నానంటూ తంబ్ నైల్స్ పెడుతున్నారు. ఇదేంతా ఘోరం? ఈ రూమర్లు విని విని అలసిపోయాను. ఇంకా నాకు ఎన్ని సార్లు పెళ్లి చేస్తారో అర్థం కావట్లేదు’ అని అసహనం వ్యక్తం చేసింది శ్రీముఖి. తనకు అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని తెలిపింది. మూడు, నాలుగేళ్ల తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని కుండబద్దలు కొట్టి చెప్పింది శ్రీముఖి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు