Deepika Padukone Pregnancy: తల్లి కాబోతున్న వార్తలకు చెక్… బేబీ పుట్టబోయే డేట్ తో సర్ప్రైజ్ ఇచ్చిన దీపికా

బాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్స్ లో ఒకరైన దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ ఎటకెలకు తమ అభిమానులకు శుభవార్త చెప్పేశారు. దీపికా పదుకొనే త్వరలోనే తల్లి కాబోతుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపిక ఆ వార్తలకు చెక్ పెట్టేస్తూ, తనకు బేబీ పుట్టబోయే మంత్ తో సహా చెప్పేసి సర్ప్రైజ్ ఇచ్చేసింది.

స్పెషల్ పోస్ట్ తో ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్
రన్వీర్ సింగ్, దీపిక జంట సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ తో తాము తల్లిదండ్రులము కాబోతున్నామన్న సంతోషకరమైన విషయాన్ని ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో సెప్టెంబర్ నెలను హైలెట్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు. అంటే దీని ద్వారా 2024 సెప్టెంబర్ లో దీపిక తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది అన్న విషయాన్ని వెల్లడించారు. ఇక ఆ పోస్టర్లో చుట్టూ న్యూ బార్న్ బేబీకి సూచనగా చిట్టి పొట్టి బట్టలు, చిన్న పిల్లల ఆట వస్తువులు, బుల్లి బుల్లి షూస్ డిజైన్ చేసి, మధ్యలో మాత్రం సెప్టెంబర్ 2024 అని రాసుకొచ్చారు. మొత్తానికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దీపిక తాను తల్లి కాబోతున్నాను అంటూ శుభవార్త చెప్పేసింది. ఈ స్పెషల్ పోస్ట్ ను చూసిన ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు దీపిక, రన్వీర్ జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

పిల్లల గురించి దీపికా హింట్…
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దీపిక తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి తన సొంత కుటుంబాన్ని ప్రారంభించడం గురించి మాట్లాడింది. తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అవే విలువలతో తమ పిల్లలను పెంచాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. అలాగే తనకు రణవీర్ సింగ్ పిల్లలంటే చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించే రోజు కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పి ప్రెగ్నెన్సీ గురించి హింట్ ఇచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా దీపికా తల్లి కాబోతోంది అన్న వార్తలకు బలం చేకూరింది.

దీపికాతో రణ్వీర్ సింగ్ ప్రేమ, పెళ్లి, ఆరేళ్ల తరువాత పిల్లలు
ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో ఈ జంట పెళ్లితో ఒకటయ్యారు. సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన తెరకెక్కించిన రొమాంటిక్ మూవీ “గోలియొం కి రాస్లీలా రాంలీలా” సెట్స్ లో వీళ్ళిద్దరూ మొదటిసారిగా కలిశారు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్త పెళ్లికి దారి తీసింది. ఇప్పుడు పెళ్లయిన ఆరేళ్ల తర్వాత ఈ జంట మొదటిసారిగా తల్లిదండ్రులు కాబోతున్నారు.

దీపికా సినిమాల విషయానికి వస్తే…
ప్రస్తుతం దీపిక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన “కల్కి 2898 ఏడి” అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “సింగం ఎగైన్” లోను దీపిక నటిస్తోంది. గత ఏడాది షారుక్ ఖాన్ తో కలిసి పఠాన్, జవాన్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది దీపిక. రీసెంట్ గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన “ఫైటర్” మూవీతో ఓ భారీ డిజాస్టర్ ను అందుకుంది. హృతిక్, దీపిక జంటగా నటించిన ఈ మూవీ నిరాశ పరిచింది. మరోవైపు రణ్వీర్ సింగ్ బాలీవుడ్ లో బిజీ హీరోగా కొనసాగుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు