Happy Birthday Sreevishnu: వాట్ ఏ జర్నీ గురు

వెబ్ డిజైనర్ గా కెరియర్ మొదలుపెట్టి బాణం సినిమాతో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు మొదట సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపిస్తూ ఉండేవాడు. అయితే పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో డెబ్యుగా లీడ్ రోల్ లో కనిపించాడు.

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా తర్వాత కూడా ఒక్కడినే, ప్రతినిధి సన్నాఫ్ సత్యమూర్తి, అసుర వంటి సినిమాల్లో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు శ్రీ విష్ణు. అయితే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వచ్చిన “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాతో మంచి పేరు శ్రీ విష్ణు కి లభించింది. ఆ తర్వాత “ఉన్నది ఒకటే జిందగీ” సినిమా శ్రీ విష్ణుకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

వివేక్ ఆత్రేయ దర్శకుడుగా పరిచయమైన మెంటల్ మదిలో సినిమాతో హీరోగా మారాడు శ్రీ విష్ణు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇటు వివేకాత్రేయ దర్శకుడిగా అటు శ్రీ విష్ణును హీరోగా నిలబెట్టింది ఆ సినిమా. ఆ సినిమా తర్వాత వేణు ఉడుగులతో “నీది నాది ఒకే కథ” అనే సినిమాను చేశాడు శ్రీ విష్ణు. ఈ సినిమా మంచి ప్రశంసలను అందుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది.

- Advertisement -

ఈ సినిమా తర్వాత చేసిన “వీర భోగ వసంత రాయలు” సినిమా డిజాస్టర్ పాలయ్యింది. ఆ తర్వాత మళ్లీ “వివేక్ ఆత్రేయ” దర్శకత్వం వహించిన బ్రోచేవారెవరురా సినిమా మంచి హిట్ అయి శ్రీ విష్ణు కి కూడా మంచి పేరును తీసుకుని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన “తిప్పరా మీసం” “గాలి సంపత్” సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.

హసిత్ గోలి దర్శకుడుగా పరిచయమైన రాజరాజ చోర సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా, బాగానే ఆడింది. ఆ సినిమాకి మంచి ప్రసంశలు లభించాయి. దర్శకుడిగా హాసిత్ గోలి ను కూడా నిలబెట్టింది ఆ సినిమా. మళ్లీ వీరి కాంబినేషన్ లో స్వాగ్ అనే సినిమా రాబోతున్నట్లు సమాచారం.

రాజరాజ చోర సినిమా తర్వాత శ్రీ విష్ణు మళ్ళీ వరుస డిజాస్టర్లు చూసి, సామజవరగమన సినిమాతో అద్భుతమైన హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు శ్రీ విష్ణు చేస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇలానే మంచి సినిమాలు ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ ఫిల్మీపై తరఫున జన్మదిన శుభాకాంక్షలు

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు