Tollywood Drugs Case: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది… క్రిష్ ఫీలింగ్ ఇదే

2008లో రిలీజ్ అయిన గమ్యం సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు క్రిష్ జాగర్లమూడి. మొదటి సినిమాతోనే తెలుగు సినిమాకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అనే ఫీల్ ని తీసుకొచ్చాడు క్రిష్. గమ్యం సినిమాలోని మనిషిని, మనిషిలోని మనిషిని అద్భుతంగా చూపిస్తూ సినిమాని చాలామంది మనసుకు దగ్గర చేశాడు. ఆ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు.

గమ్యం సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన సినిమా వేదం. ఈ సినిమాలోని సామాన్యుల జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించి చూపించాడు. ఈ సినిమాలో ఇప్పటికీ కేబుల్ రాజు, అమలాపురం సరోజ వంటి క్యారెక్టర్లు గుర్తొస్తుంటాయి. ఒక సినిమా గుర్తుండటం వేరు. ఆ సినిమాలోని క్యారెక్టర్లు గుర్తు ఉండటం వేరు. ఆ స్థాయిలో ఆ సినిమాను ప్రెసెంట్ చేశాడు క్రిష్ జాగర్లమూడి.

ఆ సినిమా తర్వాత రానా దగ్గుపాటి హీరోగా “కృష్ణం వందే జగద్గురు” అనే సినిమాను తెరకెక్కించాడు క్రిష్. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించుకొని క్రిష్ జాగర్లమూడి కి మంచి గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత తీసిన కంచె సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ అయింది.

- Advertisement -

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు ,మహానాయకుడు సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలను జన్యూన్ గా తెరకెక్కించలేదు అంటూ కొంతమంది వాదన వినిపించారు. ఆ తర్వాత మణికర్ణిక అనే సినిమాకు వచ్చిన వివాదం గురించి తెలిసిందే. ఈ సినిమాకు మొదట దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత కంగనా రనౌత్ కి ఆ సినిమాను వదిలేశాడు.

క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అని సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మధ్యలో కొంచెం గ్యాప్ దొరికింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ తరుణంలో టాలీవుడ్ లో ఎప్పటినుంచో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేస్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు రాసారు. ‘ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నారు. ఇప్పటికే ఆయనకు DrP 160 నోటీసులు జారీ చేశాం’ అని కోర్టుకు రిపోర్టు చేశారు. ఈ తరుణంలో కృష్ణ జాగర్లమూడి దర్శకత్వం వహించిన వేదం సినిమాలోని “ఎగిరిపోతే ఎంత బాగుంటుంది” అనేపాటను అందరూ గుర్తుకుతెస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు