Varun Tej : వావ్ వాట్ ఏ సాలిడ్ స్టేట్మెంట్

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు అనిపించుకునేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కంచె అనే సినిమాను చేశాడు వరుణ్ తేజ్. ఆ సినిమా కూడా వరుణ్ తేజ్ కి మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచిగానే ఆడింది అని చెప్పొచ్చు.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లోఫర్ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ పర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. పూరి కైండ్ ఆఫ్ హీరోగా కూడా వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అనిపించుకునేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు.

ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన “మిస్టర్” సినిమా ప్లాప్ అయింది. యాక్చువల్ గా ఈ సినిమా కూడా మంచిగానే స్కోర్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ పాలయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది.

- Advertisement -

వరుణ్ కెరియర్ లో ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఫిదా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమా శేఖర్ కమ్ములకు కూడా మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమాలో వరుణ్ పర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. సాయి పల్లవి వరుణ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ సాధించింది.

ఫిదా సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలిప్రేమ సినిమాను చేశాడు వరుణ్ తేజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ ఫిలిం టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి హిట్ అయి మంచి పేరును తీసుకొచ్చింది.

ఘాజి సినిమాతో ప్రూవ్ చేసుకున్న సంకల్ప రెడ్డితో జతకట్టి అంతరిక్షం అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా మంచి ప్రశంసలను తీసుకొచ్చింది.

ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సినిమాను చేశాడు వరుణ్ తేజ్. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన పెర్ఫార్మన్స్ తో అందరికీ షాక్ ఇచ్చాడు వరుణ్ తేజ్.

ఇకపోతే ఇప్పటివరకు వరుణ్ తేజ్ చేసిన సినిమా లిస్ట్ చూసుకుంటే ఒకదానితో ఒకటికి సంబంధం లేకుండా డిఫరెంట్ గా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ కెరియర్లో ముందుకెళ్తున్నాడు. అయితే రీసెంట్గా వరుణ్ తేజ్ చేసిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ఒక సాలిడ్ స్టేట్మెంట్ ను పాస్ చేశాడు. నేను కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తానని, ఈ తరుణంలో నా మార్కెట్ పోయినా కూడా నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఒక యాక్టర్ కి ఈ రకమైన డెడికేషన్ ఉండాలని వరుణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు