Abhishek Malik: తనకెన్నో కోరికలు.. నేనేమో బిజీ.. అందుకే విడాకులు – అభిషేక్ మాలిక్..

ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు పెళ్లిళ్లు అంటే మూన్నాళ్ళ ముచ్చట అయిపోయింది.. ప్రేమించి పెళ్లి చేసుకొని చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకోవడం సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర జంట అభిషేక్ మాలిక్ – సుహానీ చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు.. వీరిద్దరూ 2021 లో ఘనంగా వివాహం చేసుకున్నారు.. కలిసి ఉండాలని కోరుతూ.. అతిథులు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించారు. కానీ మూడేళ్లకే వీరి వైవాహిక బంధం బీటలు వారింది. తాజాగా నటుడు అభిషేక్ తాము విడిపోయామంటూ వెల్లడించారు.

ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ప్రకటించారు.. అయితే ఇలా మూడేళ్లకే విడాకులు తీసుకోవడంతో అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉండగా.. దీనిపై అభిషేక్ మాట్లాడుతూ.. మా మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేదు.. ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ మిస్ అవుతుంది.. దీని గురించి ఇద్దరం చర్చించుకున్నాము.. అందుకే విడాకులు తీసుకుంటేనే సంతోషంగా ఉండగలమని నిర్ణయించుకున్నాము.. కలిసి మా బంధాన్ని కొనసాగించేందుకు ఇష్టం లేకపోవడం వల్లే.. బలవంతంగా కలిసి ఉండి ఒకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం అని విడిపోయాము అంటూ తెలిపారు..

అంతేకాదు విడిపోవడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చారు అభిషేక్ మాలిక్.. నేను నా వర్క్ తో చాలా బిజీగా ఉంటాను.. ఆమె ఏవేవో కలలు కంటోంది.. పైగా తాను ముంబైకి కొత్త.. ఇక్కడ తనకు స్నేహితులు కూడా ఎవరూ లేరు.. నా ఫ్రెండ్సే ఆమె స్నేహితులు.. ఇండస్ట్రీకి చెందిన నా స్నేహితులు తనను ఎంతో ఇష్టపడతారు.. నాకంటే తనే ఎక్కువగా వారితో కలిసి బయటకు వెళ్తూ ఉండేది. అయితే నా ఫ్రెండ్స్ కూడా నేను నా భార్యకు ఎక్కువ సమయం కేటాయించడం లేదని అనేవారు.. ఆ మాట నాకు బలంగా గుచ్చుకుంది.. అది కాస్త విడాకుల వరకు వచ్చింది.. అందుకే విడాకుల కోసం దరఖాస్తు చేసాము అంటూ చెప్పుకొచ్చారు..

- Advertisement -

ఇకపోతే అభిషేక్ మాలిక్ – సుహాని చౌదరి విషయానికి వస్తే.. దాదాపు 9 నెలల పాటు డేటింగ్ చేసి 2021లో పెళ్లి చేసుకున్నారు.. ఇలా మూడేళ్ళకే విడాకులు తీసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు అభిషేక్ మాలిక్ సీరియల్స్ విషయానికి వస్తే.. 2012 లో ఛల్ సే ఔర్ మాత్ పని సీరియల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు.. ఆ తర్వాత భాగ్యలక్ష్మి, కుంకుమ భాగ్య, యే హై మొహబ్బతే, ఏక్ వివాహ్ ఐసా బీ వంటి సీరియల్స్ తో మరింత గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ పలు బాలీవుడ్ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇక సుహాని చౌదరి విషయానికి వస్తే.. మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ రంగంలోనే కొనసాగుతోంది.. ఇక ఇప్పుడు విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరి విడాకుల తర్వాత ఎవరి కెరియర్ లో వారు బిజీ అవుతారో లేక మళ్ళీ పెళ్లి చేసుకుంటారో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు