Sharukh Khan: షారుక్ ఖాన్ సక్సెస్ కి ఆ సెంటిమెంటే కారణమా..?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. అటు బాలీవుడ్ లోనూ ఇటు సౌత్ సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు ఇకపోతే గత నాలుగు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ఏడాది పఠాన్ , జవాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను విడుదల చేసి ఈ సినిమాల ద్వారా ఏకంగా రూ.1000కోట్ల క్లబ్లోకి చేరిపోయారు. ఇప్పుడు మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు షారుక్ ఖాన్.

డిసెంబర్ 21వ తేదీన తాను నటించిన డంకీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమాలు అన్ని భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉండడంతో ఈ సక్సెస్ వెనుక ఏదైనా కారణం ఉందా? అని అభిమానులు సైతం ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. షారుక్ ఖాన్ కి ఒక సెంటిమెంట్ ఉందని.. ఆ సెంటిమెంటే ఇప్పుడు ఆయన సినిమాలను మరింత సక్సెస్ అయ్యేలా చేస్తుందని సమాచారం.

ఇక షారుక్ ఖాన్ కి ఉన్న సెంటిమెంట్ విషయానికి వస్తే. వైష్ణో దేవి మాత ఆలయం ఆయనకు అత్యంత సెంటిమెంట్ దేవాలయం అని సమాచారం. అందుకే తాను నటించిన సినిమాలు విడుదలకు ముందు కచ్చితంగా ఆయన ఈ ఆలయాన్ని సందర్శిస్తారట. ఈ క్రమంలోనే పఠాన్ , జవాన్ సినిమాల విడుదలకు ముందు ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారని.. అందుకే ఈ రెండు సినిమాలు కూడా అత్యద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పుడు డంకీ సినిమా కూడా మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి వైష్ణో దేవి మాత ఆలయాన్ని సందర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇకపోతే ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా షారుక్ సినిమా పక్కా హిట్ అవుతుంది అన్న సెంటిమెంట్ ఇప్పుడు ఆయనతో పాటు అందరిలో కూడా ఏర్పడింది. అందుకే తన సినిమాల విడుదలకు ముందు వైష్ణో దేవి మాత ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు సమాచారం.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు