OTT Movies : ఈ వారం రానున్న ఓటీటీ మూవీస్ ఇవే !

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించబోతున్న ఆ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ వారం అంటే డిసెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకు మరిన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. కంటెంట్ అయితే కొత్తదే గానీ, అందులో ఈవారం ఎక్కువగా తెలుగు సినిమాలో ఓటీటిల్లోకి రాకపోవడం గమనార్హం. అయితే తెలుగు ఆడియోస్ ను పూర్తిగా నిరాశపరచకుండా కొన్ని తెలుగు సినిమాలు మాత్రం ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్న కొత్త సినిమాలు, సిరీస్ లలో ఎక్కువగా హాలీవుడ్ కు చెందినవే ఉన్నాయి. మరి డిసెంబర్ మూడో వారంలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్
దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం “జపాన్” మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. డిసెంబర్ 11న తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన “జపాన్” మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. కార్తీక్ దొంగగా నటించిన ఈ మూవీకి రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ముందుగా ఈ మూవీ ని అన్ని భాషల్లో విడుదల చేస్తామని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. కానీ రిలీజ్ టైంకి కేవలం తమిళంలో మాత్రమే ఈ మూవీని అందుబాటులో ఉంచింది. ఇక ఇప్పుడు తెలుగులో కూడా “జపాన్” మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఇక డిసెంబర్ 12న సింగిల్స్ ఇన్ ఫర్ నో సీజన్ 3 అనే వెబ్ సిరీస్, డిసెంబర్ 14న ఏస్ ది క్రౌడ్ ఫైల్స్ సీజన్ 2, ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 2 అనే రెండు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. డిసెంబర్ 15న కారోల్ అండ్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

ఆహా
రీజనల్ ఓటిటి ప్లాట్ ఫామ్ “రాక్షస కావ్యం” అనే తెలుగు సినిమా డిసెంబర్ 15న స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి శ్రీమాన్ కార్తి దర్శకత్వం వహించగా, అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్ ప్రధాన పాత్రలు పోషించారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్
“ఫ్యామిలీ” అని మలయాళ మూవీ డిసెంబర్ 15న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా, నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన “ఫ్యామిలీ” మూవీలో బాసిల్ జోసెఫ్ హీరోగా నటించారు. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఇక డిస్నీలో ది ఫ్రీలన్సర్ ది కంక్లూజన్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ 15న ప్రసారం కాబోతోంది.

అమెజాన్ ప్రైమ్
ఈవారం అమెజాన్ తెలుగు ఆడియన్స్ ని పూర్తిగా నిరాశపరచబోతోంది. ఇందులో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈవారం అమెజాన్ లో రెండు వెబ్ సిరీస్ లు, ఒక సినిమా రిలీజ్ కాబోతున్నాయి. డెత్ గేమ్స్, రీచర్ సీజన్ 2 అనే రెండు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు, సిల్వర్ అండ్ ది బుక్ ఆఫ్ డ్రీమ్స్ అనే ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ 15న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు