Hero Sriram : హీరో శ్రీరామ్ వరుస లైనప్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

తమిళ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ తెలుగులో శ్రీరామ్ గా మారి ఒకరికొకరు సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. తాజాగా పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన ఒకానొక సమయంలో సినిమాల కోసం ఎంతో ప్రయత్నం చేసి.. అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమై. ఇప్పుడు వరుస లైనప్ తో అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. తాజాగా పిండం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను చేస్తున్న తదుపరి చిత్రాల గురించి కూడా హింట్ ఇచ్చారు శ్రీరామ్. పలు ఇంటర్వ్యూల లో భాగంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. నేను నటించిన తొలి తెలుగు చిత్రం ఒకరికొకరు.. రిలీజ్ అయి 20 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్లయిన ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం.. ఎక్కువగా ఇంటి భోజనానికి ప్రాముఖ్యత ఇస్తాను.. ఉన్నదానితోనే సంతృప్తి చెంది ఆనందంగా ఉంటాను అంటూ తెలిపారు.

అలాగే పిండం సినిమా గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ సాయికిరణ్ దైదా తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిలిం చూసి ఆయన ప్రతిభ పైన నమ్మకం కలిగింది. ఇక బడ్జెట్ పరంగా టైం కి చెప్పినట్టే పిండం సినిమా పూర్తి చేశారు. ఇది థియేటర్లో చూసి అనుభూతి చెందాల్సిన హారర్ సినిమా.. నా దృష్టిలో ఇప్పటివరకు తెలుగులో భయంకరమైన హారర్ సినిమాలు అంటే రాంగోపాల్ వర్మ తీసిన రాత్రి సినిమా.. అయితే పిండం అనేది కేవలం హారర్ సినిమా మాత్రమే కాదు.. ఇందులో బలమైన కథ… భావోద్వేగాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అంటూ తెలిపారు.

అలాగే తాను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. నేను చేసిన రెక్కీ వెబ్ సిరీస్ సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ఓటీటీ కోసం నెట్వర్క్, హరికథ అనే ప్రాజెక్టులు చేస్తున్నాను. నేను, జీవి ప్రకాష్ తమిళ్ లో బ్లాక్ మెయిల్ అనే మూవీ కూడా చేస్తున్నాము. అలాగే సంభవం చిత్రం కూడా చేస్తున్నాను. ప్రస్తుతం నా చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి అంటూ తెలిపారు శ్రీరామ్.. మొత్తానికైతే పిండం సినిమాతో ఈయన మళ్లీ ట్రాక్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీరామ్ మునుపటిలాగా వరుసగా అవకాశాలు అందుకుంటూ మరింత సక్సెస్ అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు