Nani : నానిపై గురూజీ స్పెషల్ ఇంట్రెస్ట్… బన్నీని సైడ్ చేసి మరీ మూవీ ప్లాన్

గురూజీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పక్కన పెట్టి మరీ నానిపై కాన్సెంట్రేట్ చేస్తున్నాడా? ఈ దర్శకుడికి బన్నీని సైడ్ చేసి మరి ఇతనితో మూవీ ప్లాన్ చేసేటంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ వస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ డైరెక్టర్ “గుంటూరు కారం” అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో “గుంటూరు కారం” మూవీని దించబోతున్నారు మేకర్స్. ఈ మూవీ అయిపోయాక వెంటనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాల్సి ఉంది. ఈ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది అనే వార్తలతోనే ఆ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి అల్లు అర్జున్, అటు గుంటూరు కారం పూర్తయ్యాక గురూజీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టుకు AA 22 అని వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు గురుజీ తీసుకున్న నిర్ణయం బన్నీ ఫాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం మూవీ పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ నేరుగా బన్నీతో ప్రాజెక్ట్ చేయకపోవచ్చు అని తెలుస్తోంది. బన్నీ ప్రాజెక్ట్ కంటే ముందే మరో మూవీ పూర్తి చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. అది కూడా నేచురల్ స్టార్ నానితో. త్రివిక్రమ్ దగ్గర ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఉందని, గుంటూరు కారం పూర్తయిన వెంటనే, అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ పట్టాలెక్కే గ్యాప్ లో నానితో ఆ సబ్జెక్టుతో మూవీ తీయాలని అనుకుంటున్నాడని ఫిలింనగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ మూవీని చాలా తక్కువ టైంలో పూర్తి చేయాలని గురూజీ ప్లాన్. అందుకే ప్రస్తుతం బన్నీని పక్కనపెట్టి మరి దానిపై ఫోకస్ చేస్తున్నాడట ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయట. అని అనుకున్నట్టుగా జరిగి ఈ మూవీ కార్యరూపం దాలిస్తే నాని, త్రివిక్రమ్ ల కాంబో అభిమానులకు తాజా అనుభూతిని కలిగించడం పక్కా.

- Advertisement -

కాగా నాని ప్రస్తుతం తన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “హాయ్ నాన్న” మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” అనే మూవీ చేయాల్సి ఉంది. కొన్ని నెలల క్రితమే టైటిల్ను రివీల్ చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో నాని చేరిపోయే అవకాశం ఉంది. మరి త్రివిక్రమ్, నాని కాంబోలో వచ్చే ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు