Samyuktha Menon: ఇన్నాళ్లు ఏమైపోయావ్ పాప?

సంయుక్త మీనన్… ఈ పేరుకు ప్రస్తుతం సౌత్ లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా అజ్ఞాతవాసంలో ఉన్న ఈ బ్యూటీ తాజాగా “డెవిల్” మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెరిసింది. మరి ఇన్నాళ్లు ఈ పాప ఏమైపోయినట్టు?

మలయాళ నటి సంయుక్త మీనం టాలీవుడ్ లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో అభిమానులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్”లో విలన్ గా నటించిన మరో టాలీవుడ్ స్టార్ నాకు భార్యగా నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుసగా కళ్యాణ్ రామ్ తో బింబిసార, కోలీవుడ్ హీరో ధనుష్ తో సార్, సాయిధరమ్ తేజ్ తో విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, మలయాళ.. ఇలా ఒక్కో భాషలో దాదాపు పదుల సంఖ్యలో సినిమాలు చేసి సైలెంట్ గా స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిష్ట వేయడం ఖాయం అని సినీ విశ్లేషకులు భావించారు. కానీ ఈ అనుకోకుండా కెరీర్ పీక్స్ ఉన్న ఆ టైంలోనే సంయుక్త సడన్ గా సైలెంట్ అయిపోయింది.

- Advertisement -

ఆమె హీరోయిన్ గా నటించిన విరూపాక్ష మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ సంయుక్త సడన్గా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇక తాజాగా ఈ బ్యూటీ “డెవిల్” మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెరిసింది. ఈ మూవీలో సంయుక్త కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. సంయుక్త సినిమాలకు ఇచ్చిన ఈ గ్యాప్ లోనే శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు టాలీవుడ్లోకి దూసుకొచ్చేశారు.

అయితే అసలు సంయుక్త ఇలా సైలెంట్ అయిపోవడానికి గల కారణం ఏంటి అంటే… సంయుక్త మీనన్ కుటుంబంలో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే ఇండస్ట్రీకి ఆమె కొంతవరకు బ్రేక్ ఇచ్చిందని అందుకే ఆ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదని రూమర్స్ వచ్చాయి. మరి కొంతమంది మాత్రం ఇస్తానని చెప్పి, సంయుక్తను పక్కనపెట్టి మరో హీరోయిన్ ను తీసుకున్నాడని, ఆ కారణంతోనే డిస్టర్బ్ అయినా సంయుక్త ఇండస్ట్రీలో కనిపించలేదని వార్తలు వచ్చాయి.

ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలీదు. కానీ సంయుక్త మళ్ళీ సడన్ గా ఇలా “డెవిల్” ఈవెంట్లో ప్రత్యక్షం కావడం ఆమె అభిమానులను సంతోషానికి గురి చేస్తోంది. మరి ఈ అమ్మడు ఇప్పటికైనా వరుస సినిమాలు చేస్తుందా? లేదంటే కేవలం “డెవిల్” ప్రమోషన్స్లో మాత్రమే మెరుపుతీగలా మెరిసి మాయమైపోతుందా అనేది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు