Tollywood: నెల జీతానికి పనిచేస్తున్న స్టార్ హీరోలు.. ఏమైందంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్లో ఉండడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఏదైనా తేడా వచ్చిందంటే ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది కెరియర్.. సరైన ప్లానింగ్ తోనే కెరియర్ ను ముందుకు సాగించేలా ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా కెరియర్ సాగుతుంది. కానీ కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మాత్రం అంతే అని చెప్పవచ్చు. చాలామంది హీరోలు ప్రారంభంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత వరుస ఫ్లాపుల కారణంగా ఒక్కసారిగా కెరియర్ డౌన్ అయిపోతుంది.

ఆ తర్వాత మళ్లీ స్టార్ స్టేటస్ ని అందుకోవడం కోసం చాలామంది హీరోలు సతమతమవుతూ ఉన్నారు. అయితే టాలీవుడ్ హీరోలలో కూడా ఒకప్పుడు రెమ్యూనరేషన్ అందుకొని ఇప్పుడు నెలవారీ జీతాల కోసం సినిమాలలో నటించడానికి ఒప్పుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి హీరోలు మన టాలీవుడ్ లో చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్ గురించి చెబితే మొదట్లో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని దాదాపుగా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేవారు.

హీరోగా ఎదిగి ఇప్పుడు నెలకు 3 లక్షల రూపాయల చొప్పున జీతంతో సినిమాలలో హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.నా సామి రంగ సినిమాలో రాజ్ తరుణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రాజ్ తరుణ్ బాటలోనే ఇప్పుడు మరో హీరో పని చేస్తున్నారు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.. అప్పుడెప్పుడో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్ ఆ తర్వాత మధ్యలో అడపాదడపా సినిమాల్లో పర్వాలేదు అనిపించుకున్నారు. అయినప్పటికీ కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అయితే ఈయన కూడా ప్రతినెల రూ.2 లక్షల జీతానికి హీరోగా పనిచేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

టాలీవుడ్ లో ఉండే సీనియర్ హీరో హీరోయిన్లు కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటున్నారు. ఇక మరొక హీరో అల్లు శిరీష్ కి కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి దుస్థితితే ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన కెరియర్ లో కూడా సరైన సక్సెస్ లేదని చెప్పవచ్చు.అలాగే నటుడు సుమంత్, సుశాంత్ తదితర నటీనటులు కూడా రాబోయే రోజుల్లో నెలవారి జీతానికే హీరోలుగా నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇలా అయినా సరే నిర్మాతలకు లాభాలను అందించి సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు