Devil trailer event: ఈవెంటేమో “డెవిల్”ది… ప్రమోషన్స్ ఏమో “దేవర”వి ?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “డెవిల్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. అయితే ఈవెంట్ చూశాక ఈవెంట్ ఏమో “డెవిల్” మూవీది, ప్రమోషన్స్ ఏమో “దేవర” మూవీకి అని అనిపించక మానదు. అలా అనిపించడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు.

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం “డెవిల్” డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో కళ్యాణ్రామ్ సరసన సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ మామ నిర్మించి దర్శకత్వం కూడా వహించారు. నిజానికి ఈ మూవీ దర్శకుడు నవీన్ మేడారం కాగా, ఆ తర్వాత నెలకొన్న వివాదాల వల్ల నిర్మాత అభిషేక్ నామ దర్శకుడిగా తన పేరుని వేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. 1940ల టైం లో భారత దేశంలో జరిగిన పీరియాడిక్ థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ డ్రామానే డెవిల్ మూవీ. ట్రైలర్లో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ లో పని చేస్తున్న ఏజెంట్ డెవిల్ కు ఓ మర్డర్ మిస్టరీ కేసును అప్పజెప్తారు. ఇక ఆ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. రాజమహల్ లో జరుగుతున్న చీకటి రహస్యాలను కనుగొనడమే ఈ ఏజెంట్ పని. ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉంది. కానీ ఈవెంట్ జరిగిన కొన్ని విషయాలే నెటిజన్లకు నచ్చలేదు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ “డెవిల్” మూవీది. కాబట్టి స్టేజ్ పై ఈ మూవీ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. కానీ కళ్యాణ్ రామ్ ఈ మూవీ వేదికపై దేవర అప్డేట్ కూడా ఇచ్చేశాడు. దేవర మూవీ గురించి అప్డేట్స్ చెప్పొద్దని తన తమ్ముడు అన్నాడని, కానీ తాను మాత్రం స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను అని, తారక్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత ఏ నటుడు, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ బై అయిన బాధ్యత మరింతగా పెరుగుతుందని, అందుకే ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని, దేవర మూవీ విఎఫ్ఎక్స్ కు చాలా టైం పడుతుందని, త్వరలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ చేస్తామని వెల్లడించాడు. నిజానికి తారక్ ఫ్యాన్స్ గోల చేయడంతోనే కళ్యాణ్ రామ్ ఈ అప్డేట్ ఇచ్చాడు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కూడా దేవర మూవీకి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

కానీ ఈ అప్డేట్ ను ట్విట్టర్ లో కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇలా “డెవిల్” మూవీని ప్రమోట్ చేసుకోకుండా “దేవర” మూవీని హైలెట్ చేసి ప్రమోట్ చేసుకుంటున్నారని కొంతమంది, కాదు కాదు “డెవిల్” మూవీపై హైప్ పెంచుకోవడానికి “దేవర”ను వాడుకుంటున్నారని మరికొంతమంది అంటున్నారు. దీంతో ఈ నెగెటివిటీ అంతా కళ్యాణ్ రామ్ పైనే పడుతుంది. కాబట్టి ఇకనైనా కళ్యాణ్డం తన నెక్స్ట్ ప్రమోషనల్ ఈవెంట్లలో ఎన్టీఆర్ గురించి గానీ, దేవర గురించి గానీ ప్రస్తావించకుండా ఉంటే బాగుంటుందేమో అంటున్నారు సినీ విశ్లేషకులు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు