Hbd Venkatesh : వెంకీ మామ భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ వెంకటేష్ పర్సనల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే అందులోనూ ఆయన భార్య దగ్గుబాటి నీరజ రెడ్డి గురించి చాలామందికి తెలియదు. ఈరోజు వెంకీ మామ పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య నీరజా రెడ్డి ఏం చదువుకున్నారు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

మంచి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, తనదైన టాలెంట్ తో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్. ఈయనకు మాస్, క్లాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల నుంచి అభిమానులు ఉన్నారు. 36 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ పై అలరిస్తున్న ఈ హీరోకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నీరాజనాలు పడుతూ ఉంటారు. అయితే వెంకటేష్ పేరు చెప్పగానే టక్కున గుర్తుపడతారు. కానీ ఆయన భార్య, పిల్లలు, పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇలా అనడం కన్నా వెంకటేష్ ఆ విషయాలను బయట పెట్టడానికి ఇష్టపడడు అనడం కరెక్ట్.

మామూలుగా సెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయం అయినా వెంటనే బయటకు రావడం ప్రేక్షకులకు తెలిసిపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ వెంకటేష్ మాత్రం చాలా డిఫరెంట్. ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా ఎవరికీ తెలియకుండా ప్రైవేట్ గా ఉండడానికే ఇష్టపడతాడు. అంతేకాకుండా తన సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో సైతం ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరు కారు. వెంకటేష్ తన కుటుంబ సభ్యుల గురించి, తన భార్య నీరజ గురించి ఎక్కడ ప్రస్తావించిన సందర్భాలు లేనేలేవు. ఇక బయట ఎక్కడ ఆమెతో కలిసి వెంకటేష్ కనిపించలేదు. వెంకటేష్ రెండున్నర దశాబ్దాల క్రితం నీరజారెడ్డిని కులాంతర వివాహం చేసుకుని అప్పట్లోనే యూత్ కు రోల్ మోడల్ గా నిలిచాడు. వెంకీ మామ భార్య నీరజా రెడ్డిది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లి. వీళ్ళ పెళ్లి జరగడం వెనుక ఉన్న కథ ఆసక్తికరంగా ఉంటుంది.

- Advertisement -

కులం తన వివాహం అయినప్పటికీ వెంకటేష్, నీరజ రెడ్డిలది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన వివాహమే. నిజానికి వెంకటేష్ ను పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, శ్రీమంతులు రెడీగా ఉన్నారట. సురేష్ బాబుకు వివాహమైన అనంతరం ఓ రోజు చెన్నైలో షూటింగ్లో ఉండగా రామానాయుడు దగ్గరకు వచ్చిన విజయ ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత నాగిరెడ్డి వెంకటేష్ కోసం నీరజ రెడ్డి సంబంధం తీసుకొచ్చాడట. దీంతో రామానాయుడు కుల పట్టింపు లేకుండా మదనపల్లికి చెందిన గంగవరపు సుబ్బారెడ్డి, ఉషారాణిల కుమార్తె నీరజ రెడ్డినీ తన కోడలుగా చేసుకోవడానికి అంగీకరించారట. అప్పటికే నీరజారెడ్డి అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిందట. 1985లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నీరజా రెడ్డిది రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కుటుంబం. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వెంకటేష్ భార్య నీరజకు స్వయానా మేనమామ కావడం విశేషం.

ఇక నీరజారెడ్డి తన భర్త పెద్ద హీరో అనే విషయాన్ని పట్టించుకోకుండా చాలా సింపుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు వెంకటేష్ సినిమాలతో బిజీగా ఉంటే, ఆమె మాత్రం కుటుంబ బాధ్యతలను నెత్తినెత్తుకొని, ఇప్పటికీ ఇంట్లో నలుగురు పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు వాళ్ళ చదువుల్లో కూడా నీరజ పాత్రనే కీలకం. అలా ఓ పెద్దింటికి కోడలైనా సామాన్యురాలులాగే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తోంది నీరజా రెడ్డి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు