Hbd Regina Cassandra: రెజీనా కెరీర్ ను నాశనం కావడానికి మెగా హీరోనే కారణమా?

శివ మనసులో శృతి అనే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఈ చెన్నై సొగసరికి గతంలో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉండేది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడి మ్యాజిక్ పని చేయట్లేదు. అయితేనే టాలీవుడ్ ను వదిలేసి తమిళంతో పాటు హిందీలోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. ఈరోజు రెజీనా పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ లో ఆమె కెరియర్ ఇలా అయిపోవడానికి అసలు కారణం ఏంటి అనే విషయం తెలుసుకుందాం.

14 ఏళ్ల వయసులోనే తమిళ చిత్ర సీమలోకి నటిగా అడుగు పెట్టింది రెజీనా. ఆ తర్వాత కొన్ని తమిళం, కన్నడ సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. కేడి బిల్లా కిలాడి రంగ అనే సినిమాలో “పాప” అనే పాత్రలో చేసి, చెన్నై వాసులకు అదే పేరుతో సుపరిచితురాలు అయింది రెజీనా. ఇక ఆ తర్వాత ఎస్ఎంఎస్ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో ఈ భామకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే కొత్త జంట, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, అ!, జో అచ్యుతానంద వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ మంచి హిట్స్ అయితే పడ్డాయి కానీ, ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ గా బ్రేక్ మాత్రం రాలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఉన్న రెజీనాకు ఒక్క స్టార్ హీరోతో కూడా నటించే అవకాశం రాలేదు. కానీ మీట్ రేంజ్ హీరోలకు మాత్రం ఈ బ్యూటీ మంచి ఆప్షన్ లా మారింది.

ఈ నేపథ్యంలోనే రెజీనా టాలీవుడ్ లో ఓ హీరోతో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాల్లో రెండు హిట్ మూవీలు మెగా హీరోతోనే చేసింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం.. రెండు సినిమాల్లో హీరోగా సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ గా రెజీనా నటించారు. ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో పాటు, ఈ జంట ఆన్ స్క్రీన్ పేరు బాగుండడంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అన్నారు. అయితే ఈ విషయంపై ఇద్దరూ స్పందించలేదు. కానీ ఆ రోమర్స్ తరువాతే రెజినా కెరియర్ ఒక్కసారిగా స్లో అయిపోయి ఛాన్సులు తగ్గిపోయాయి. ఆ తర్వాత “ఆచార్య”లో స్పెషల్ సాంగ్ అంటూ టాలీవుడ్ లోకి రియల్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో తెలుగులో వచ్చే అడపాదడపా సినిమాలు చేసుకుంటూ, తమిళంలో మాత్రం బిజీగా మారిపోయింది. అయితే ఇప్పటికి రెజీనా అభిమానులు టాలీవుడ్ లో ఆమె కెరీర్ ఇలా అయిపోవడానికి ఆ మెగా హీరోతో వచ్చిన రూమర్సే కారణం అంటూ ఉంటారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు