Salaar : టికెట్ ధర రూ.400… మూవీ చూడాలంటే ఒకరోజు పేదోడి కడుపు కాలాల్సిందేనా?

పాన్ ఇండియా మూవీ “సలార్” రిలీజ్ టైం దగ్గర పడింది. అయితే ఈ సినిమాకు పెరిగిన టికెట్ రేట్లు చూస్తే సామాన్యుల మైండ్ బ్లాక్ కావడం ఖాయం. కేవలం సినిమా చూడడానికే టికెట్ రేటు ఏకంగా రూ.400లకు పైగా పెరిగిపోవడం ఆడియన్స్ ను బెంబేలెత్తిస్తోంది. మరి “సలార్” మూవీకి టికెట్ రేట్లు ఎంతవరకు పెరగబోతున్నాయి అంటే?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్“. ఈ మూవీ డిసెంబర్ 22న థియేటర్లలోకి రాబోతోంది. సినిమా రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో చిత్ర బృందం ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయకపోవడం పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీకి పెరగబోతున్న టికెట్ రేట్లు సాధారణ ఆడియన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. “సలార్” టీం గతంలో “ఆర్ఆర్ఆర్” టీం పెంచినట్టుగానే తమ సినిమాకు కూడా టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నైజాంలో టికెట్ ప్రైస్ హైక్, స్పెషల్ షోల కోసం అప్లై చేసుకున్నారు. అలాగే ఇప్పుడు “సలార్” మూవీ విషయంలో వర్తించే టికెట్ రేట్లు “ఆర్ఆర్ఆర్”కు సమానంగా ఉంటాయని సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే మల్టీప్లెక్స్ లలో జీఎస్టీ తో కలిపి రూ. 413, సింగల్ స్క్రీన్ లలో జిఎస్టి తో కలిపి రూ. 236 వరకు టికెట్ రేట్లు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ పెంపు ఒక వారం పూర్తిగా నడుస్తుందట. వారం తర్వాత మల్టీప్లెక్స్ లలో రూ. 354, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 230 గా ఉండేలా చూసుకుంటున్నారట మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారట “సలార్” టీం.

ఒకవేళ ప్రభుత్వం నుంచి వారి రిక్వెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే అది సామాన్య ప్రేక్షకుల నెత్తిమీద పిడుగు పడ్డట్టే. ఒక్కో టికెట్ ధర 400 దాటడం అంటే, రోజు కూలి చేసుకునే వారికి ఒకరోజు కూలి అన్నమాట. అంటే సలార్ మూవీని మల్టీప్లెక్స్ లో చూడాలి అనుకునే సాధారణ ప్రేక్షకుడు ఈ మూవీ టికెట్ కొనాలంటే దానికోసం ఒక రోజు కడుపు మార్చుకోక తప్పదు. కాగా ప్రస్తుతం మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర రూ. 295, సింగిల్ స్క్రీన్ లలో రూ. 175 గా ఉంది.

- Advertisement -

ఇక ఇప్పటిదాకా కేవలం “ఆర్ఆర్ఆర్” మూవీ మాత్రమే ఇలాంటి ఇలాంటి అధిక టికెట్ ధరలతో, అదనపు షోలతో రిలీజ్ అయింది. మరి ఇప్పుడు కొత్త తెలంగాణ ప్రభుత్వం సలార్ టీం రిక్వెస్ట్ కు టికెట్ రేట్ల విషయంలో, స్పెషల్ షోలా అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు షోలను వేసుకోవడానికి అనుమతించ లేదన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వస్తుందని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు