Devil : కళ్యాణ్ రామ్ కు సంయుక్త గోల్డెన్ లెగ్ వర్క్ అవుతుందా?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు హీరోయిన్ సంయుక్త వల్ల కలిసిరాబోతోందా? ఆమె గోల్డెన్ లెగ్ వల్ల ఈ మూవీ కూడా హిట్ కాబోతోందా? ఈ డౌట్స్ రావడానికి కారణం ఏమిటంటే…

కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ “డెవిల్”. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 29న రిలీజ్ కాబోతోంది. అభిషేక్ నామా దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అయితే ఈ మూవీలో గోల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించడాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు నందమూరి అభిమానులు.

కళ్యాణ్ రామ్ కొన్నాళ్ల క్రితం “బింబిసార” మూవీ తో బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హి ఈజ్ బ్యాక్ అనుకున్నారు నందమూరి అభిమానులు. కానీ అంతలోనే “అమిగోస్” అంటూ భారీ డిజాస్టర్ తో వారిని నిరాశపరిచాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో డెవిల్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది మాత్రమే కాకుండా కళ్యాణ్ రామ్ మార్కెట్ స్థిరంగా ఉండాలంటే ఈ మూవీ హిట్ కావడం ఆయనకు ఎంతో ముఖ్యం. ఇక్కడే సంయుక్త మీనన్ సెంటిమెంట్ కళ్యాణ్ రామ్ కి కూడా వర్కౌట్ అవుతుందా ?అనే ప్రశ్న తలెత్తింది.

- Advertisement -

సంయుక్త మీనన్ కెరీర్ గ్రాఫ్ ను ఒక్కసారి గమనిస్తే టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు. ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో సంయుక్త మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ, భీమ్లా నాయక్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన సర్, బింబిసార, విరూపాక్ష వంటి సినిమాలు వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. నిజానికి ఆ సమయంలో హిట్ కోసం సతమతం అవుతున్న కళ్యాణ్ రామ్ కు బింబిసారా సినిమాతో, సాయి ధరం తేజ్ కి విరూపాక్ష సినిమాతో ఈ అమ్మడు సూపర్ డూపర్ హిట్లను ఇవ్వడంతో సంయుక్త మీనన్ కు గోల్డెన్ లెగ్ అనే బిరుదు ఇచ్చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీ.

అలాగే ఇప్పుడు మరోసారి కళ్యాణ్ రామ్ కు “డెవిల్” విషయంలో కూడా సంయుక్త మరోసారి లక్కీ అని నిరూపించుకుంటుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. మరి మరోసారి సంయుక్త మ్యాజిక్ పని చేస్తుందా అనేది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు