Love Life Tips : లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను నమ్ముతున్నారా? అయితే ఇది మీ కోసమే

లవ్ ఎట్ ఫస్ట్ సైట్… ఈ పదం వినడానికి ఎంత బాగుంటుందో కదా. అలాగే ఈ పదాన్ని వినగానే మన లైఫ్ లో జరిగిన పలు మధురమైన విషయాలు కళ్ళ ముందు గిర్రున తిరుగుతాయి. మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అసలు ఉంటుందా? ఆ ఫీలింగ్ ఎంతవరకు నిజం? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్… తొలిచూపు ప్రేమ గురించి మన కవులు ఎన్నెన్ని కవితలు రాశారో, అలాగే మన దర్శక నిర్మాతలు ఎన్ని రొమాంటిక్ సినిమాలు తీశారో. ఆ సినిమాలు చూసినప్పుడు మనకు కూడా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే అలాంటి అద్భుతమైన ఫీలింగ్ తో వచ్చే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. సినిమాల్లో వచ్చే సన్నివేశాలు చూసి మనం కూడా మన లైఫ్ లో అలాంటివి ఏవైనా ఉంటే బాగుంటుందని కలల్లో తేలిపోతూ ఉంటాం. ఆల్రెడీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లైఫ్ లో ఉన్నవారు దాన్ని తలచుకొని పొంగిపోతూ ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అసలు ఉందా? లేక అదొక రొమాంటిక్ ఫ్యాంటసీనా? అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అయితే అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఎంతవరకు నిజం? అనే అసలు విషయంలోకి వెళ్తే…

ప్రస్తుతం ఉన్న సినిమాల ఎఫెక్ట్ కారణంగానో లేదా మరే ఇతర కారణాల వల్లనో తెలియదు కానీ చాలామంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేదాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ విషయంపై ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలో సైతం చాలామంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు అనే విషయం స్పష్టమైంది. 46% మంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంది అని నమ్ముతుంటే, 67% మంది మాత్రం ఫస్ట్ లవ్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నమ్ముతున్నారట. ఎందుకంటే ఫస్ట్ లవ్ అనేది చాలావరకు వన్ సైడ్ గా ఉంటుంది. అంతేకాకుండా యుక్త వయసులో ఉన్నప్పుడు కలిగే మొదటి ఆకర్షణను చాలామంది ఫస్ట్ లవ్ గా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమేనని, ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదని సర్వేలో చెబుతున్నాయి.

- Advertisement -

అవతలి వ్యక్తి గురించి ఏమాత్రం తెలియకుండా చూడగానే ప్రేమలో పడడం నిజానికి అబద్ధం. అది కేవలం అట్రాక్షన్ మాత్రమే. నిజమైన ప్రేమ అంటే ఒకరి పట్ల ఒకరికి ఎంత కాలమైనా విడిపోలేనంత ప్రేమ ఉండడం, ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు కలవడం. ఇలాగైతేనే ఇద్దరి మధ్య జీవితాంతం కలిసి ఉండేటంత ప్రేమ ఉంటుంది. అంతేగాని చూడగానే అది ప్రేమ కాదు, కేవలం వారి పట్ల మీకున్న ఆకర్షణ. వాళ్లని ఎక్కువసార్లు కలిసాక, వాళ్లతో శృంగారంలో పాల్గొన్నాక దాదాపుగా ఈ ఫస్ట్ లవ్ తగ్గిపోతుంది. అలా చేశాక కూడా తగ్గలేదు అంటేనే మీది నిజమైన ప్రేమ.

సాధారణంగా టీనేజ్ పిల్లలే ఈ అనుభూతికి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అయితే ఆ టైంలో వాళ్లు అవతలి వ్యక్తికి తమ మనసును విప్పి చెప్పలేరు కాబట్టి వాళ్లకి దగ్గర అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో తమ ఫీలింగ్స్ ని, ఆలోచనలను మనసులోనే దాచుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు తలచుకున్నా కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది మంచి ఫీలింగ్ ని కలిగిస్తూ ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు