Kalyan Ram: ఇయర్ ఎండ్ వార్… డెవిల్‌కి పోటీగా రవితేజ, రజినీకాంత్

ఈ ఇయర్ ఎండ్‌కి ఎవరు ఉండరు.. సోలోగా తన సినిమాను రిలీజ్ చేసి ఓ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటా అని అనుకున్నాడు కళ్యాణ్ రామ్. తన నటిస్తున్న డెవిల్ సినిమాను డిసెంబర్ 29న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. కానీ, సడన్‌గా కళ్యాణ్ రామ్ కి పోటీ వచ్చేసింది. అది కూడా టాలీవుడ్ లో మాస్ మహారాజా గా పేరున్న రవితేజ. మరొకరు సూపర్ స్టార్ రజినీకాంత్.

రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమా సంక్రాంతికి ఉంది. రజినీకాంత్ నటిస్తున్న లాల్ సలాం మూవీకి ఇంకా చాలా టైం ఉంది కదా.. మరి ఇప్పుడు వీళ్ల సినిమాలేంటి అనుకుంటున్నారా? కొత్త సినిమాలేం కాదు లేండి. ఇప్పటికే థియేటర్స్ లో రిలీజ్ అయి… రికార్డులు క్రియేట్ చేసిన పాత సినిమాలను మళ్లి రిలీజ్ చేయబోతున్నారు. అందేనండి.. రీ రిలీజ్.

రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఫస్ట్ లిస్ట్ లో వెంకీ సినిమా ఉంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ స్పెషలే. ఈ సినిమాను ఇప్పుడు కూడా యూట్యూబ్ లో చూస్తున్న వారి సంఖ్య ఎక్కువే. అయితే ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 30న వెంకీ సినిమా థియేటర్స్ లోకి మళ్లీ రాబోతుంది.

- Advertisement -

అలాగే రజినీకాంత్ కెరీక్ బూస్ట్ ఇచ్చిన శివాజీ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వచ్చిన చూసే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను డిసెంబర్ 31న మళ్లీ థియేటర్ లలో తీసుకురాబోతున్నారు.

పేరుకు పాత సినిమాలే అయినా, ఇది కళ్యాణ్ రామ్ డెవిల్ పై భారీ ప్రభావాన్నే చూపించే అవకాశం ఉంటుంది. డెవిల్ 29న రిలీజ్ కానుంది. వెంకీ 30, శివాజీ 31న వస్తాయి. అంటే డెవిల్ కి ఉన్న టైం 29 ఒక్కటే. అందులోనూ.. ఈ డేట్స్ పైన సలార్, డుంకి ప్రభావం ఉంటుంది. ఇలా పాత సినిమాలు, కొత్త సినిమాల మధ్య వస్తున్న డెవిల్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు