Salaar : నో ప్రమోషన్స్… ప్రభాస్ షాకింగ్ డెసిషన్

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీకి ప్రచారం జరుగుతున్నట్టే ప్రమోషన్స్ ఉండబోవా? అసలు ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ నిర్ణయం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ఎంతో కాలం నుంచి డార్లింగ్ ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే టీం ఇంకా ప్రమోషన్లను ప్రారంభించలేదు. గతవారం విడుదలైన “సలార్” ట్రైలర్ చాలామందిని నిరాశపరిచినప్పటికీ, అంచనాలను అయితే పెంచగలిగింది. ప్రస్తుతం ఈ సినిమాపై హైప్ భారీగా ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదిలా ఉండగా ఎప్పుడుడెప్పుడు ప్రభాస్ స్వయంగా “సలార్” మూవీని ప్రమోట్ చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు “సలార్” మూవీకి ప్రమోషన్స్ ఉండవని ప్రచారం జోరు అందుకుంది. ఒకవైపు ఈ రూమర్స్, మరోవైపు “సలార్” టీం సైలెన్స్ డార్లింగ్ టెన్షన్ లో పడేసింది. తాజాగా ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాడ్ న్యూస్.

ప్రభాస్ “సలార్” మూవీని ప్రమోట్ చేసే మూడ్ లో లేకపోవడంతో ప్రమోషన్లకు నో చెప్పాడని తెలుస్తోంది. ఆయన నిర్ణయంతో మేకర్స్ సైతం షాక్ కు గురయ్యారట. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేసే అవకాశం లేకపోయింది మేకర్స్ కి. అయితే అసలు నిజం ఏమిటంటే ప్రభాస్ ప్రస్తుతానికి విశ్రాంతిలో ఉన్నారు. ఇటీవల ఆయన తన మోకాలికి సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రెస్ట్ మోడ్ లో ఉండడంతో ప్రమోషన్స్ కి హాజరయ్యే అవకాశం లేదట. అందుకే సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదని సమాచారం. ఇక ఈ వార్త తెలిసిన నెటిజన్లు అన్న హెల్త్ ముఖ్యం ఈవెంట్స్ కాదు అంటూ సర్దుకుపోతున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ప్రభాస్ లేకపోయినా హీరోయిన్ మిగతా వాళ్లతో కలిసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయొచ్చు కదా? ప్రభాస్ అన్న నుంచి ఒక్క ఇంటర్వ్యూ చాలు అంటూ నిర్మాతలను వేడుకుంటున్నారు. మేకర్స్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేయలేదు గాని నటీనటులు అందరితో కలిసి వీడియో ఇంటర్వ్యూలు రికార్డ్ చేసి, త్వరలోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.

- Advertisement -

ఇక మరో ట్రైలర్ విడుదల కానుందని వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతానికి దాని గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు ఈ చిత్రంపై టీం చాలా నమ్మకంగా ఉందట. అలాగే సినిమాకు ఇప్పటికే కావలసినంత భారీ బజ్ ఉంది. ఇక ఈ చిత్రంలో రెండు పాటలు ఉండగా, వాటిని సినిమా విడుదలకు ముందే రిలీజ్ చేస్తారా? లేదా అనే దానిపై కూడా క్లారిటీ లేదు. ప్రశాంతిని దర్శకత్వం వహించిన “సలార్” ఇద్దరు స్నేహితుల కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు