Tamannah: సినిమాలు లేకపోతేనేం.. అలా చేసి లక్షలు సంపాదిస్తున్న మిల్కీ బ్యూటీ

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్లోకి మొదటగా మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాతో మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న , పెద్ద హీరోలతో చిందులేసి భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వయస్సు 40 కి దగ్గరగా వస్తున్నా.. ఇంకా ఈమె క్రేజ్ కి ఎలాంటి డోకా లేదు అని చెప్పవచ్చు. పైగా ఈ మధ్యకాలంలో ఆమె బాయ్ ఫ్రెండ్ నీ కూడా పరిచయం చేయడంతో .. సోషల్ మీడియాలో మరింత హల్చల్ చేస్తోంది. త్వరలోనే అతడిని వివాహం కూడా చేసుకోబోతోంది.

ఇదిలా ఉండగా మొన్నటి వరకు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం స్పెషల్ సాంగులకే పరిమితమైవుతోందని చెప్పవచ్చు. ఇటీవల రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో నడిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోకపోయినా సరే భారీగా సంపాదిస్తోంది అంటూ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. అసలు విషయంలోకి వెళితే తన వయసు 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా తన తోటి హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో జీవితంలో సెటిల్ అవుతుంటే తమన్నా మాత్రం ఒక వైపు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ మరొకవైపు పలు యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు సోషల్ మీడియా ద్వారా కూడా ఈ అమ్మడు మరింత ఆర్జిస్తోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక వచ్చే ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సినిమాలలో అవకాశాలు లేకపోయినా పలు యాడ్స్ ద్వారా ఈమె బాగా సంపాదిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తమన్నా ఆస్తుల విషయానికొస్తే సుమారుగా రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మరి వచ్చే ఏడాదైనా తన బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ లో సెటిల్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు