Jackky Bhagnani: మిల్క్ బ్యూటీ కంటే తెలివిగా నిర్ణయం తీసుకున్న రకుల్ ప్రీత్

సినిమా ఇండస్ట్రీలో నటీనటులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ల మధ్య ప్రేమ పుట్టడం సహాజం. తొటి నటులను, డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను పెళ్లి చేసుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇటీవల మిల్క్ బ్యూటీ తమన్నా… తమ తొటి నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి విధితమే. చాలా రోజుల పాటు ఈ జంట డేటింగ్ విషయంలో అనేక వార్తలు వచ్చాయి. తమన్నా, విజయ్ వర్మ ఎంత గోప్యత పాటించినా, ఎక్కడో ఒక చోట వీరు క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోసల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యేవి.

దీంతో తమన్నా.. విజయ్ వర్మతో ఉన్న రిలేషన్ షిప్ గురించి బయట పెట్టక తప్పలేదు. నిజానికి ప్రేమ విషయంలో నటీనటులు ఎంత గోప్యత పాటించినా, బయటకు రావడం ఎంతో సమయం పట్టదు. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ముందే గ్రహించినట్టుంది. అందుకే తన భాయ్ ఫ్రెండ్.. నిర్మాత జాకీ భగ్నానీతో తన రిలేషన్ షిప్ గురించి రెండేళ్ల క్రితమే ఇన్స్ట్రాగ్రామ్ వేదికగ ప్రకటించింది. ఇలా రెండేళ్ల క్రితమ తన ప్రేమ విషయాన్ని ప్రకటించడంపై తాజాగా రకుల్ స్పందించింది.

సెలబ్రెటీలు రిలేషన్ షిప్ వివరాలను దాచడం అంత సులువు కాదు. అందుకే నేను జాకీ భగ్నానీ గురించి ముందే చెప్పేశా. నాకు రహస్య ప్రేమలపై పెద్దగా నమ్మకం లేదు. ఈ విషయాన్ని ముందే చెప్పడం వల్ల ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉన్నాను. అయితే ఇప్పుడు నా పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. గతంలో డిసెంబర్ లో ఒకసారి, ఫిబ్రవరి లో మరోసారి నేను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. నాకు సోషల్ మీడియాలోనే రెండు సార్లు జరిగిపోయింది అంటూ ఫన్ని కామెంట్స్ చేశారు.

- Advertisement -

కాగా, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి ఇటీవల ఐ లవ్ యూ అనే సినిమా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చింది. అంతే కాకుండా ఇండియాన్ 2, ఆయలాన్ సినిమాల్లో నటిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు