Adipurush: ఓంరౌత్ చేసిన పనికి… నేపాల్ లో భారతీయ సినిమాలకు షాక్

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎక్కడ విన్న ఒకటే వినిపిస్తుంది. అదే ఆదిపురుష్. రామాయాణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లో ఆడుతుంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 300 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ఎన్ని కలెక్షన్లు వస్తున్నాయో… అన్ని వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముడుతున్నాయి. రాముడు పాత్ర చేసిన ప్రభాస్ లుక్స్ పైనా, రావణాసుర పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ లుక్స్ పైనా, పాత్ర డిజైన్ పైనా అనేక రకమైన ట్రోల్స్ వస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ వర్క్స్, లంక నగరం పై కూడా విమర్శలు వస్తున్నాయి.

వీటితో పాటు సినిమాలోని కొన్ని డైలాగ్స్ వివాదాలకు కారణం అవుతున్నాయి. లంక దహనానికి ముందు భజిరంగి తో చెప్పించిన డైలాగ్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ దిగివచ్చి… ఆ డైలాగ్స్ ను మార్చుతున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో సమస్య వచ్చిపడింది ఈ సినిమాకి. నేపాల్ రాజధాని ఖాట్మాండులో భారతీయ సినిమాలపై బ్యాన్ వేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆదిపురుష్ సినిమా మొత్తం అబద్ధాలే అని విమర్శిస్తూ, ఆదిపురుష్ సినిమాతో పాటు భారతీయ సినిమాలన్నింటిపైన బ్యాన్ వేశారు.

సీత జన్మ స్థలం నేపాల్ అని అందరూ భావిస్తారు. కానీ, ఆదిపురుష్ సినిమాలో సీత.. భారతదేశ బిడ్డ అన్నట్టు చెప్పారు. ఈ డైలాగ్ తొలగించకపోవడంతో అక్కడి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇండియన్ సినిమాలపై బ్యాన్ విధించింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు