Nabha Natesh: ఫాదర్స్ డే రోజు తన చైల్డ్ హుడ్ మెమరీ షేర్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ

“నన్ను దోచుకుందువటే” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఫేమ్ సంపాదించిన బ్యూటీ “నభా నటేష్”. కర్ణాటక కి చెందిన ఈ బ్యూటీ ముందుగా కన్నడ ఇండస్ట్రీలోనే అడుగుపెట్టినా, పాపులర్ అయింది మాత్రం తెలుగులో. ఇస్మార్ట్ శంకర్ లో చాందిని గా యూత్ ని అట్ట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస తెలుగు సినిమాలతో బిజీ అయింది. “సోలో బ్రతుకే సో బెటర్”, అల్లుడు అదుర్స్, మాస్ట్రో లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. అయితే తన చివరి రెండు చిత్రాలు ప్లాప్ అవడంతో పెద్దగా అవకాశాలు రావట్లేదు.

అయినా సోషల్ మీడియా లో ఎప్పటికప్పడు వార్తల్లో నిలుస్తుంది. పలు యాడ్స్ షూట్లలోనూ నటిస్తూ బిజీగానే ఉంది. ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తోను ముచ్చటిస్తూ వైరల్ అవుతూ వస్తుంది. తాజాగా ఫాదర్స్ డే సందర్బంగా తన తండ్రి తో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోని అభిమానవులతో షేర్ చేసుకుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఆ మధ్య తన కుడి భుజానికి గాయం అవడం తో సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన నభా నటేష్ ఇప్పడు ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా చేయకపోయినా హైదరాబాద్ లోనే ఉంటుంది నభ. ముందు ముందు పూరి తీస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో ఈ భామ నటించే అవకాశం ఉంది. అయితే ఇటు సినిమాల్లో నటించకపోయినా పలు యాడ్స్ లో నటిస్తూ బుల్లితెరకు దగ్గరగా ఉంటుంది నభా నటేష్. మరి ఏ డైరెక్టర్ అయినా నభా నటేష్ కి మళ్ళీ తన టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు