చిట్టికి ప్రమోషన్..!

చిట్టి నా బుల్ బుల్ చిట్టి… పాటతో కుర్రకారు గుండెల్లో నిలిచిన ఫరియ అబ్దుల్లా గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవరసం లేదు. జాతి రత్నాలు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిట్టి, తొలి సినిమాతోనే కావాల్సినంత క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత చిట్టికి పెద్దగా అవకాశాలేమీ రాలేదు. కానీ ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో గెస్ట్ రోల్ తో పాటు బంగార్రాజు సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ భామ మాస్ మహారాజ రవితేజతో రావణాసుర సినిమాలో నటిస్తుంది.

ఇదిలా ఉండగా.. చిట్టికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫరియ అబ్ధుల్లాకు ఏకంగా పాన్ ఇండియా మూవీ నుంచి ఆఫర్ వచ్చిందట. బిచ్చగాడు ఫేం విజయ్ అంటోనీ హీరోగా సుసీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా చిట్టిని ఎంపిక చేశారట.

1980 లోని పిరాయడికల్ డ్రామాగా తెరకెక్కుతన్న ఈ మూవీ  పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల నుండి సమాచారం. అయితే ఈ వార్త నిజం అయితే.. చిట్టి కెరీర్ మలుపు తిరిగినట్టే. మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు కూడా రావచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు