చిరు, బాబీ మధ్యలో కోన

దర్శకుడు దశరథ్, గోపీచంద్ మలినేనిల దగ్గర డైరెక్షన్ టీం లో పని చేసిన బాబీ రవి తేజ హీరోగా తెరకెక్కిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.పవర్ సినిమాతో హిట్ అందుకున్న రవీంద్రబాబీ వెంటనే పవర్ స్టార్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసారు.సినిమా పెద్దగా ఆడకపోయినా బాబీ కి అయితే మాత్రం మంచి పేరునే తీసుకుని వచ్చింది,పవన్ రాసుకున్న సర్ధార్ స్క్రిప్ట్ కు పూర్తి న్యాయం చేసాడు అనిపించింది.

ఆ ప్రాజెక్ట్ తరువాత ఎన్టీఆర్ తో చేసిన జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ లో ఉన్న ప్రతి కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు బాబీ. రియల్ లైఫ్ మామ అల్లులైన నాగచైతన్య , వెంకటేష్ ను ను రీల్ లైఫ్ లో కూడా పెట్టి వెంకీమామ సినిమాతో కూడా పర్వాలేదు అనుకున్నాడు.
ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు బాబీ. అయితే ఇక్కడే కొత్త చిక్కులు మొదలయ్యాయి.

చిరంజీవి తో సినిమా చేస్తున్నందుకు ఆనందపడాలో , మెగాస్టార్ ను సెట్ లో సంతృపి చెయ్యలేకపోతున్నా అని బాధ పడాలో అర్ధం కానీ పరిస్థితి ప్రస్తుతం బాబీది. ప్రస్తుతం బాబీ చేస్తున్న “వాల్తేరు వీరయ్య” సినిమా విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట మెగాస్టార్. సినిమా షూటింగ్ స్లోగా జరగడం, బాబీ పనితనం మెప్పించే స్థాయిలో లేకపోవడం వలన సెట్ లోనే తన అసంతృప్తిని ప్రదర్శిస్తున్నారు మెగాస్టార్ అనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఈ ఇస్స్యూను క్లియర్ చెయ్యడానికి రచయిత , నిర్మాత కోన వెంకట రంగంలోకి దిగారంట. మెల్లగా మెగాస్టార్ ను ఒప్పించి షూటింగు సక్రమంగా జరిగే ప్రయత్నాలు చేస్తున్నారంట కోన వెంకట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు