సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవర్సీస్ లో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్నారు.రాజమౌళి తర్వాత అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది మహేష్ సినిమాలకే..! అతని ప్రతీ సినిమా అక్కడ $1 మిలియన్ డాలర్లను వసూల్ చేస్తూ ఉంటుంది. ‘దూకుడు’ నుండీ మహేష్ నటించిన చాలా సినిమాలు అక్కడ $1 మిలియన్ కొట్టాయి.’శ్రీమంతుడు’ చిత్రం $2.8 మిలియన్, ‘భరత్ అనే నేను’ $3.4 మిలియన్, ‘సరిలేరు నీకెవ్వరు’ $2.2 మిలియన్ డాలర్లను వసూల్ చేసాయి. మరి ‘మహేష్ కు ఈసారైనా 1 మిలియన్ ముచ్చట తీరుతుందా?’ అంటూ ఆ హెడ్డింగ్ ఏంటి? అనే డౌట్ మీకు రావచ్చు. విషయం ఏంటంటే.. మహేష్ నటించిన ప్రతీ సినిమా అక్కడ $1 మిలియన్ డాలర్లను వసూల్ చేస్తున్నాయి. కాకపోతే ఓపెనింగ్స్ విషయంలో అంటే ప్రీమియర్స్ తో మహేష్ $1 మిలియన్ కొట్టలేకపోతున్నాడు.
‘బాహుబలి’ ‘బాహుబలి2’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి రాజమౌళి చిత్రాలు ప్రీమియర్స్ తోనే $1 మిలియన్ మార్క్ ను అధిగమించి రికార్డులు కొట్టాయి. వాటిని పక్కన పెట్టేస్తే.. ప్రీమియర్స్ తో 1 మిలియన్ కొట్టిన హీరోలుగా చిరు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ తో చిరు, ‘అజ్ఞాతవాసి’ తో పవన్ కళ్యాణ్ ఈ ఫీట్ ను సాధించారు. మహేష్ బాబు మాత్రం ఈ ఫీట్ ను సాధించలేకపోయాడు. ‘స్పైడర్’ చిత్రం $900+ K తో కాస్త దగ్గరగా వచ్చింది. మరి ‘సర్కారు వారి పాట’ తో అయినా మహేష్ ఆ ఫీట్ ను సాధిస్తాడా లేదా అన్నది చూడాలి..!