విజయ్- దిల్ రాజు మూవీలో నాని..నిజమెంత?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.  ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌’ బ్యానర్  పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతుంది అంటూ దిల్ రాజు అండ్ టీం చెబుతున్నా.. ఇది తమిళ్ సినిమా అని తెలుగులో డబ్ అవుతుంది అని విజయ్ చెబుతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్టులో విజయ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో నాని కూడా నటించబోతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం కాస్త గట్టిగానే జరుగుతుంది. నాని ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నట్టు ఆ కథనాల సారాంశం. ఈ విషయమై చిత్ర బృందాన్ని ఆరా తీయగా అందులో నిజం లేదు అంటున్నారు.సో ఇది వట్టి గాసిప్ అని తేలిపోయింది. ఇక ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ వంటి వారు కీలక పాత్రలకి ఎంపికయ్యారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కాబోతున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు