అక్కినేని వారి కోడలుగా రాజీనామా చేసిన సమంత.. అదే చైతన్యతో విడాకులు తీసుకున్న సమంతని ఎవరో కొంతమంది పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సమంతని ప్రతీ విషయంలోకి లాగుతూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.మొన్నటికి మొన్న కాజల్ తల్లి అయినప్పుడు.. ఆ విషయంలోకి సమంతని లాగి ట్రోల్ చేశారు. నిజానికి తల్లి అవ్వడం అనేది గొప్ప భాగ్యం. అది తాను కావాలని కోరుకుంటున్నట్లు సమంత చాలా సార్లు చెప్పింది. అయినా ఇలాంటి వ్యక్తిగత విషయాలతో ఆమెని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అని అంతా అభిప్రాయపడ్డారు.
నాగ చైతన్య ఫ్యాన్స్ కొంతమంది సమంతని ట్రోల్ చేస్తూ ఉండొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. కానీ అతనికి అంతలా లాయల్ ఫ్యాన్స్ అయితే లేరు. పైగా సమంత కంటే అతనికి ఎక్కువ ఫ్యాన్ బేస్ లేదు.పోనీ సమంత యాంటీ ఫ్యాన్స్ ఇలా ట్రోల్ చేస్తున్నారా అంటే.. సమంత ఇప్పుడు లీడింగ్ స్టార్ హీరోయిన్ ఏమీ కాదు. అంతలా పనిగట్టుకుని ఆమెని ట్రోల్ చేయాల్సిన అవసరం యాంటీ ఫ్యాన్స్ కు ఏముంటుంది. ఇవి అర్ధంకాకేనేమో సమంత.. ‘నిజాలు ఆలస్యంగా బయటకి వస్తాయి.. అబద్దాలు ఎక్కువగా ప్రచారం అవుతాయి’ అంటూ ఓ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మరి సమంతని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరై ఉంటారో..!