మహేష్ అన్న డోస్ పెంచాడురోయ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. సర్కారు వారి పాట మూవీ రిలీజ్ కు మరొక్క రోజు మాత్రమే ఉంది. మహేష్ కోసం రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పటికే రచ్చ రచ్చ చేసేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుండి రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ మూవీ కూడా ఫుల్ జోష్ మీద ఉంది. ఇదే ఊపు లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. సర్కారు వారి పాట రిలీజ్ కాక ముందే.. మహేష్ తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టేసాడు. కాగ దర్శకధీరుడు జక్కన్న డైరెక్షన్ లో సూపర్ స్టార్ తర్వాత మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ స్టోరీని ఎంచుకున్న రాజమౌళి.. దానికి మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట.

హాలీవుడ్ స్టార్ హీరో డ్వేన్ జాన్సన్ ( రేస్లర్ ది రాక్ ) మెయిన్ రోల్ లో చేసిన జంగిల్ క్రూజ్ ఆధారంగా ఈ మూవీని జక్కన్న చెక్కుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రెజర్ హంట్, యాక్షన్ బేస్డ్ అడ్వెంచర్స్ సినిమాగా తెరకెక్కించాలని దర్శకధీరుడు ప్లాన్ చేస్తున్నారట. 

- Advertisement -

అలాగే ఈ మూవీని మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే చిత్రీకరించనున్నారట. అందుకోసం ఆఫ్రికన్ అడవులకు వెళ్లడానికి కూడా రెడీ అయిపోయారని ఇండస్ట్రీ వర్గాల టాక్. 

వరుసగా మూడు విజయాలతో ఫుల్ స్వీంగ్ పైన ఉన్న సూపర్ స్టార్.. సర్కారు వారి పాటతో నాలుగో విజయం అందుకునే జోష్ లో ఉన్నాడు. దీని తర్వాత మహేష్ డోస్ పెంచి హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు