AadiKeshava: డీసెంట్ బొమ్మంట.. పెయిడ్ రివ్యూలు కూడా ప్లాన్ చేసారా ఏంటి?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో “ఆదికేశవ” ఒకటి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేయగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించాడు. నవంబర్ 24న రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, ఆడియన్స్ నుండి కనీసం ఓకే అన్న మాట కూడా ఎక్కడా వినిపించట్లేదు.

అయితే ఈ సినిమా ప్లాప్ అవుతుందని ముందే గమనించారు కావచ్చు, ఓవర్సీస్ ప్రీమియర్ షో లు కూడా క్యాన్సిల్ చేయించాడు నిర్మాత నాగవంశీ. కానీ ఇక్కడ తనకి నచ్చిన కొన్ని థియేటర్లలో ప్రీమియర్లు వేయించాడు. అయితే చాలా మంది సినిమా రివ్యూవర్లు, ఇంకా సినిమా సైట్ల వాళ్ళు సినిమా డిజాస్టర్ అని పూర్తి స్థాయిలో కంఫర్మ్ ఇవ్వగా, కొన్ని పాపులర్ ఛానల్ వాళ్ళు డీసెంట్ అని, పర్వాలేదని మెల్లిగా పాజిటివ్ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి టైం లోనే ఆడియన్స్ కి నిర్మాత నాగవంశీ పై డౌట్ వస్తుంది. సినిమా డిజాస్టర్ అని ముందే తెలుసు కాబట్టి ప్రీమియర్లు క్యాన్సిల్ చేయించాడు, అలాగే పెయిడ్ రివ్యూలు కూడా వేయిస్తున్నాడని కొందరు ట్రేడ్ విమర్శకులు భావిస్తున్నారు. అయితే ఎన్ని పెయిడ్ రివ్యూలు ఇచ్చినా, ఒక్కటి వాస్తవం. కంటెంట్ బాగుంటే టాక్ పట్టించుకుకోకుండా జనాలు హిట్ చేసేస్తారు. అదే బాలేకపోతే ఎన్ని పాజిటివ్ రివ్యూలు వేసిన, ఏ సెలెబ్రెటీ తో చెప్పించినా ఆడియన్స్ పట్టించుకోరు. మరి ఆది కేశవ ఎంత వరకు థియేటర్లో ఆడుతుంది అనడం కన్నా, ఎన్ని రోజులు థియేటర్లో ఉంచుతారు అనాల్సి వస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు