Flirting Tips : ఇలా ఫ్లర్ట్ చేస్తే ఎంతటి అందగత్తె అయినా పడిపోవాల్సిందే

ఈ టిప్స్ ఫాలో అవుతూ ఫ్లర్ట్ చేశారంటే ఏ అమ్మాయి అయినా పడిపోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న యూత్ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఎంతో కలుపుగోలుగా ఉంటూ లైఫ్ లో హ్యాపీగా గడిపేస్తున్నారు. అలాగే అమ్మాయితో అబ్బాయి గాని, అబ్బాయితో అమ్మాయి గాని ఫ్లర్ట్ చేయడం ఈ రోజుల్లో చాలా సాధారణ విషయం. అయితే కొంతమందికి మాత్రం అమ్మాయిల్ని ఎలా ఫ్లర్ట్ చేయాలి అనే విషయం అస్సలు తెలియదు. ఒకవేళ తెలిసినా చేయడానికి సిగ్గు, బిడియం వంటి కారణాలతో వెనకాడుతూ ఉంటారు. అయితే అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా లేని ఫ్లర్టింగ్ మాత్రమే మంచిదే. ఈ ఆర్టికల్ లో అసలు ఎలా ఫ్లర్ట్ చేస్తే అమ్మాయిలు ఈజీగా పడతారో తెలుసుకుందాం.

1. చిరునవ్వుతో స్టార్ట్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళని చూసినప్పుడు ఆ ఆనందం తెలపడానికి మీరు ఇచ్చే స్మైల్ చాలా ముఖ్యం. ఆ చక్కని చిరునవ్వు మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా, నమ్మదగిన వారిగా కనిపించేలా చేస్తుంది.
Flirting Tips for boys
2.  అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం. లేదంటే మీరు పరధ్యానంగా ఉన్నారని లేదా అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదని అవతలి వ్యక్తి అనుకునే అవకాశం ఉంది. ఐ కాంటాక్ట్ వల్ల మీరు శ్రద్ధగా వాళ్ళ మాటలు వింటున్నారని వారికి అర్థమవుతుంది.

flirting-tips-for-boys

- Advertisement -

3. హ్యూమర్ అనేది లైఫ్ లోనే కాదు రిలేషన్ షిప్ లో కూడా ఎంతో ముఖ్యం. మీరు వేసే సెటైరికల్ కామెంట్స్ లేదా జోక్స్ అవతలి వ్యక్తితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడంలో హెల్ప్ చేస్తాయి.

flirting-tips-for-boys

4. పొగడ్తలకు పడని వారు ఎవరు ఉంటారు? అయితే అవి సందర్భానుచితంగా ఉండాలి. మీరు ఫ్లర్ట్ చేయాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వం, అలవాట్లు, వారి సక్సెస్ కు సంబంధించిన విషయాలను తెరపైకి తీసుకొస్తూ నిజమైన కాంప్లిమెంట్ ఇవ్వండి. వాళ్లకు సంబంధించిన ప్రత్యేకమైన విషయాల గురించి అభినందించడానికి ప్రయత్నించండి.

 flirting-tips-for-boys

5. అమ్మాయిలు చెప్పే విషయాలను చురుగ్గా వినండి. అదే టాపిక్ పై ప్రశ్నలు అడగండి. అలాగే వారి ఇష్టం, అయిష్టాలపై శ్రద్ధ పెట్టండి.

 flirting-tips-for-boys

6. నమ్మకంగా కలిగించండి. మితిమీరిన ఆత్మవిశ్వాసం అహంకారంలాగా కనిపిస్తుంది. ఒకవేళ సిగ్గు పడుతూ ఉన్నారంటే అవతలి వ్యక్తికి మీ ఆసక్తి, ఉద్దేశం ఏంటి అనేది అంచనా వేయడం కష్టతరం అవుతుంది. కాబట్టి మీరు కాన్ఫిడెన్స్ గా కనిపిస్తే అవతలి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు.

 flirting-tips-for-boys

7. బాడీ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఐ కాంటాక్ట్, చిన్న చిరునవ్వు వంటి బాడీ లాంగ్వేజ్ అవతలి వ్యక్తికి మిమ్మల్ని మరింత చేరువయ్యేలా చేస్తుంది.

flirting-tips-for-boys
8. సరదాగా ఆటపట్టించండి. అయితే అది దానివల్ల అవతలి వ్యక్తి ఏ విధంగానూ హర్ట్ కాకుండా చూసుకోవడం ముఖ్యం. సున్నితంగా ఆటపట్టించడం వల్ల ఇద్దరి మధ్య తేలికైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

 flirting-tips-for-boys

9. వాళ్లలో మీ పట్ల ఆసక్తిని పెంచడానికి స్నేహపూర్వక ఛాలెంజ్ లలో పాల్గొనండి. వాళ్ల చేయి లేదా భుజాన్ని తేలికగా తాకండి. అయితే హద్దుల్లో ఉండడం ముఖ్యమని గుర్తుంచుకోండి. వారి అనుమతి లేకుండా ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దు.

flirting-tips-for-boys

10. ఇక అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడూ ఎలా ఉంటారో అలాగే ఉండండి. లేని మాస్కులు ధరించవద్దు. ఇక అలాగే ఫ్లోలో వెళ్తూ ఉండండి. అవతలి వ్యక్తి మీరు చేసే ఏ పనితో నైనా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే వెనక్కి తగ్గడం ముఖ్యం. వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి

flirting-tips-for-boys

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు