Mansoor: త్రిషను క్షమాపణ కోరిన మన్సూర్.. కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. త్రిష పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సినిమా పరిశ్రమ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. లైంగిక వేధింపుల కేసు కింద ఆయన పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయినా సరే వెనుకడుగు వేయని మన్సూర్ అలీ ఖాన్.. తాను త్రిష కి క్షమాపణ చెప్పను అని, తమిళ్ ప్రేక్షకులు తనకు అండగా నిలిచారు అంటూ మొన్నటి వరకు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

దీంతో అటు తమిళ ఇండస్ట్రీ తో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు త్రిషకి అండగా నిలిచారు. ఇక మంజూరు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేనని.. నడిగర్ సంఘం అయితే త్రిష కు క్షమాపణలు చెప్పకపోతే సభ్యత్వాన్ని రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు.. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆమెకు క్షమాపణ చెప్పను అని తెలిపారు. ఇక ప్రస్తుతం చట్టపరమైన చర్యలు చుట్టుముడుతున్న వేళ మన్సూర్ దిగొచ్చినట్లు తెలుస్తోంది.

త్రిషకి క్షమాపణలు చెబుతూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు మన్సూర్ అలీ ఖాన్.. మీడియాకు విడుదల చేసిన ప్రకటనను ప్రముఖ ట్రేడ్ పండితులైన రమేష్ బాల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది.. అందులో ఏముంది అనే విషయానికొస్తే.. నా సహ నటి త్రిష దయచేసి నన్ను క్షమించండి .. అంటూ మన్సూర్ అలీ ఖాన్ తమిళంలో తెలిపారు. అంతేకాదు త్రిషకు పెళ్లి జరగాలని.. ఆమె మంగళ సూత్రాన్ని ఆశీర్వదించే అవకాశం దేవుడు తనకు కల్పించాలని కూడా ఆయన కామెంట్లు చేసినట్లు రమేష్ బాల తాను పోస్ట్ చేసిన స్టేట్మెంటులో ఉంది. ఇకపోతే త్రిష పైన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మన్సూర్ పై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.

- Advertisement -

ఈ కేసులో భాగంగానే విచారణ కోసం పోలీసులు ఎదుట కూడా హాజరయ్యారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈయనపై కేసు వేసింది . ఇక ఈ కేసులన్నీ ఆయనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తట్టుకోలేక క్షమాపణ చెప్పినట్లు సమాచారం. ఏదిఏమైనా నిన్నటి వరకు అసలు క్షమాపనే చెప్పనని తెలిపిన మన్సూర్ అలీ ఖాన్.. నేడు ఇన్ని కేసులు చుట్టి ముట్టడంతో ఒక్కసారిగా భయపడిపోయి.. త్రిషకి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది .. ఏది ఏమైనా ఆడవారిని గౌరవించాలి కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చివరికి పతనమే మిగులుతుందని మరొకసారి నిరూపణ అయ్యింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు