Radha: వైరల్ గా మారిన నటి రాధ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే..?

ఒకానొక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి.. ఆ తర్వాత కాలంలో కూడా తన అందంతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఆ కాలంలోనే తన అందంతో, నటనతో పోటీపడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మరింతగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన కూతురు ప్రముఖ హీరోయిన్ కార్తీక కు వివాహం జరిపించిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకలలో కార్తీక తన ఒంటినిండా బంగారు నగలతో మెరిసింది.

కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ అనే వ్యక్తితో కార్తీక ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుకలలో ఒంటినిండా బంగారు నగలతో దర్శనమిచ్చిన కార్తీకను చూసి అసలు రాధా ఆస్తులు ఎంత అనే విషయం తెరపైకి వచ్చింది. ఒకవైపు ఎన్నో కోట్లు సంపాదించిన ఈమె ముంబై , కేరళలో కూడా ఫైవ్ స్టార్ హోటల్ లను నడుపుతూ మరింతగా సంపాదించిందని సమాచారం.

అసలు విషయంలోకి వెళితే.. 250 కి పైగా చిత్రాలలో నటించి కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన బంధువైన రాజశేఖరన్ నాయర్ అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది రాధా ..పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి పలికిన ఈమె ముంబైలోనే నివాసం ఉంటుంది. అంతేకాదు అక్కడే ఒక రెస్టారెంట్ ను కూడా నడుపుతోంది. ఇకపోతే కార్తీక తండ్రి రాజశేఖరన్ బిజెపి నాయకుడు. అంతేకాదు కేరళలోని అతిపెద్ద వ్యాపారవేత్త కూడా.. 16 సంవత్సరాల వయసులోనే తమిళనాడు, ముంబైలో కూరగాయల దుకాణాలలో, హోటల్లో పనిచేసిన ఈయన 25 సంవత్సరాల అనుభవంతోనే తన స్వస్థలమైన కేరళలో హోటల్ వ్యాపారం మొదలుపెట్టారు.

- Advertisement -

ఇక నేడు కోట్లాది రూపాయలను సంపాదించి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇకపోతే మొత్తం వీరి ఆస్తుల విలువ సుమారుగా రూ.400 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఏదిఏమైనా కార్తీక పెళ్లి ఫోటోలు చూస్తే చాలు రాధా, రాజశేఖరన్ దంపతులు ఏ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టారో అర్థం అవుతుంది. మొత్తానికి అయితే కార్తీక వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. మరి ఇకనైనా కార్తీక సినిమాలలోకి వస్తుందా లేక తన తల్లి లాగే పెళ్లి తర్వాత వ్యాపారానికే పరిమితం అవుతుందా అన్నది చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు