Extra-Ordinary Man : డీజే టిల్లు హీరో కోసం క్రేజీ ప్రాజెక్ట్ వదులుకున్న నితిన్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో టేకప్ చేయడం, ఆ మూవీలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం మామూలే. అయితే తాజాగా నితిన్ డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కోసం తనకు వచ్చిన ఒక అద్భుతమైన ఛాన్స్ ను త్యాగం చేశాడట. ఆ మూవీ ఏంటి? నితిన్ ఎందుకు అలా చేశాడు? అనే వివరాల్లోకి వెళితే…

యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ కమర్షియల్ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కానుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ట్రైలర్ కంప్లీట్ ఫన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సిల్వర్ స్క్రీన్ పై నితిన్, వక్కంతం వంశీ ప్రేక్షకులను హిలేరియస్ గా నవ్వించి మ్యాజిక్ చేస్తామని నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నితిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. కథ నచ్చకపోతే ఏ హీరో అయినా ఆ ప్రాజెక్టును రిజెక్ట్ చేయడం సర్వసాధారణం. అయితే నితిన్ తన వద్దకు వచ్చిన ఓ కథ నచ్చినప్పటికీ జెన్యూన్ గా వ్యవహరించి, మరో హీరో సిద్దు జొన్నలగడ్డ ఆ కథ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేశారట.

ఇటీవల టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ శ్రీనిధి శెట్టి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొత్త చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. “తెలుసు కదా” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే “మాచర్ల నియోజకవర్గం” షూటింగ్ లో నితిన్ బిజీగా ఉన్నప్పుడే నీరజ ఆయనకు ఈ కథను వినిపించిందట. అయితే నితిన్ కు కథ కూడా నచ్చింది. కానీ ఆ పాత్రకు తనకంటే సిద్దునే న్యాయం చేయగలరని భావించి, సిద్ధూ అయితే బాగా సెట్ అవుతాడని నీరజకు సలహా ఇచ్చారట నితిన్. దీంతో అదే రోజు రాత్రి 10 గంటలకు నితిన్ సిద్దుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడట. ఇంకేముంది ఆ తర్వాత సిద్దు కథ వినడం, ప్రాజెక్టు ఓకే కావడం వెంటవెంటనే జరిగిపోయింది. అలా సిద్దు కోసం నితిన్ తనకు నచ్చిన కథను త్యాగం చేసేసాడట. మరి ఈ ప్రాజెక్ట్ సిద్దుకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు