Salaar : సెకండ్ ట్రైలర్లో డబుల్ సర్ప్రైజ్… గెట్ రెడీ డార్లింగ్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సలార్’ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ‘సలార్’ ట్రైలర్ 110 మిలియన్ల వ్యూస్ అందుకుని ‘కేజిఎఫ్ 2’ రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ‘సలార్’ ట్రైలర్ ప్రేక్షకులను నిరాశపరిచిన నేపథ్యంలో మీకు త్వరలోనే మరో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఫిల్మీఫైకి అందిన సమాచారం ప్రకారం సెకండ్ ట్రైలర్ లో డబుల్ సర్ప్రైజ్ ఉందట.

అసలు సర్ప్రైజ్ ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే… ‘సలార్’ సెకండ్ ట్రైలర్ లో ఇంకొక ప్రభాస్ కనిపించబోతున్నాడట. అది కూడా పెద్ద పెద్ద మీసాలతో అని టాక్ నడుస్తోంది. అంటే ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేశాడన్నమాట. ఇక పెద్ద పెద్ద మీసాలతో ఇంకో ప్రభాస్ కనిపించబోతున్నాడు అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇందులో హీరోతో పాటు విలన్ గా కూడా ప్రభాస్ కనిపించబోతున్నాడని అనుకుంటున్నారు. మరి స్వయంగా ప్రభాస్ తో ప్రభాస్ ఫైట్ చేస్తే ఆ రణరంగం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఏదైతేనేం ఫస్ట్ ట్రైలర్ డిసప్పాయింట్ చేయడంతో సెకండ్ ట్రైలర్ కోసం ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా.

‘సలార్’ రెండవ ట్రైలర్ ని డిసెంబర్ 16న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ ట్రైలర్లోనైనా ప్రేక్షకులు ఆశించిన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మూడు నిమిషాల పాటు ఉండబోయే ‘సలార్’ సెకండ్ ట్రైలర్ గురించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం ‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. డిసెంబర్ 22న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కు రెడీ అవుతుండగా, మరికొన్ని రోజుల్లోనే చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేయనుంది. మరి ఈ ట్రైలర్ తోనైనా ప్రేక్షకుల్లో ఉన్న అసంతృప్తిని మేకర్స్ తొలగిస్తారేమో చూడాలి.

- Advertisement -

కాగా వరుస పరాభవాల తర్వాత మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్లాన్ లో ఉన్నాడు ప్రభాస్. మరి ఈ మూవీ అయినా ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందా అనేది టాలీవుడ్ లో ఉత్కంఠతను రేపుతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా, జగపతిబాబు పృథ్వీరాజ్ సుకుమారన్, బాబి సింహ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ రెండు భాగాలుగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు