Nithin: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్…బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్..

నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నితిన్ కి అచొచ్చిన కామెడీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కడం వల్ల సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఏరియాల వారీగా.. నైజాం 7.50 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఆంధ్ర 9 కోట్లు ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 19.50 కోట్లు జరగగా, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 1.70 కోట్లు, ఓవర్సీస్ లో 3 కోట్లు వరల్డ్ వైడ్ గా 24.50 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 25 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి.

ఇక నితిన్ భీష్మ తర్వాత మరో హిట్ కొట్టలేదు. ఆ తర్వాత వచ్చిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజక వర్గం ఒకదాన్ని మించి మరొకటి ప్లాప్ అయ్యాయి. అయినా హ్యాట్రిక్ సినిమాల ప్లాప్ ల తర్వాత కూడా నితిన్ సినిమాకి మంచి బిజినెస్సే జరిగిందని చెప్పొచ్చు. అయితే జరిగిన బిజినెస్ కి సినిమాపై ఉన్న బజ్ కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొంత ఎక్కువే అని చెప్పాలి. పైగా పోటీగా హాయ్ నాన్న సినిమా కూడా రిలీజ్ అవుతుంది.

అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కామెడీ జోనర్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాకి గనుక పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. మరి హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఈ సినిమా అయినా నితిన్ ని గట్టెక్కిస్తుందో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు