Sreeleela: నేషనల్ లెవెల్ లో అలాంటి గుర్తింపు.. హీరోయిన్ గా మాత్రం కాదండోయ్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ సెన్సేషనల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత రవితేజ నటించిన ధమాకా చిత్రంతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి తానేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న శ్రీ లీల ఏకంగా ఏడుకి పైగా సినిమాలలో నటిస్తూ ఉండడం గమనార్హం.

ఈ క్రమంలోనే తాజాగా ఆమె నటించిన చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో భాగంగానే చిత్ర బృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాదులో ఘనంగా జరిపారు. ఇక ఈ ఈవెంట్లో శ్రీ లీల, నితిన్ తో పాటు రాజశేఖర్ కూడా హాజరయ్యి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అంతేకాదు శ్రీ లీల గురించి నితిన్ చేసిన కామెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీ లీల గురించి నితిన్ మాట్లాడుతూ.. శ్రీ లీలా కి నటన మాత్రమే కాకుండా మరిన్ని టాలెంట్స్ ఉన్నాయి… నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను.. నేను హీరో డాన్స్ వచ్చు.. ఇక అన్ని మామూలుగానే ఉంటాయి.. శ్రీ లీల కూడా ఒక హీరోయిన్ కాబట్టి నటిస్తోంది ..డాన్స్ చేస్తుందని మాత్రం తెలుసు.

అంతే కాదు తాను డాక్టర్ చదువుతోందని కూడా తెలుసు. అయితే తాను డాన్సర్ , యాక్టర్, డాక్టర్ మాత్రమే కాదు మరిన్ని వాటిలో కూడా టాపర్ అని నాకు షూటింగ్ మొదటి రోజే తెలిసింది.. శ్రీ లీల స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడిందట.. హాకీ కూడా స్టేట్ లెవెల్ లో ఆడినట్లు తెలిపింది. తనకి కూచిపూడి , భరతనాట్యం కూడా వచ్చు. ఇంకా వీణ కూడా వాయిస్తుంది. ఇవన్నీ ఆమె ఆరోజు చెప్పకపోతే తనలో ఉన్న ఈ టాలెంట్స్ బయటపడేవి కాదు.. ఇక తాను చెప్పిన వెంటనే నేను ఆశ్చర్యపోయాను.. ఇంత చిన్న పిల్లలో అన్ని టాలెంట్స్ ఉన్నాయా అనిపించింది.. అంటూ అసలు విషయం బయటపెట్టారు నితిన్. మొత్తానికైతే శ్రీ లీలాలో ఉన్న టాలెంట్ ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు