Hi Nanna & Extra Ordinary Man : ‘యానిమల్’ డామినేషన్… నాని, నితిన్ గండం గట్టెక్కుతారా?

నేచురల్ స్టార్ నాని “హాయ్ నాన్న” మూవీతో డిసెంబర్ 7న ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాడు. ఆ మరుసటి రోజు “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” అంటూ నితిన్ కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. అయితే ముందుగా అనుకున్నట్టుగానే ఈ రెండు సినిమాలకు కూడా ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ‘యానిమల్’ మూవీ గండంగా మారింది. మరి నితిన్, నాని ఈ గండాన్ని గట్టెక్కుతారా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ కు ఇప్పుడు ‘యానిమల్’ ఫీవర్ పట్టుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపైనే అంతటా చర్చ నడుస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజులు గడిచిపోయినప్పటికీ ఇంకా ఆ ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గలేదు. సినిమాలో ఉన్న వైలెన్స్, ఓవర్ డోస్ శృంగార సన్నివేశాలు ప్రేక్షకులపై అలాంటి ప్రభావం చూపించాయి మరి. ప్రస్తుతం ఈ మూవీ 500 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోలు నాని, నితిన్ తమ సినిమాలో విడుదల చేయడానికి సాహసం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ వేర్వేరు జోనర్లలో తమ అభిమానులను అలరించడానికి వస్తున్నారు.

“హాయ్ నాన్న” మూవీ విషయానికొస్తే శౌర్యువ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కియారా ఖన్నా కీలక పాత్రలో నటించారు. తండ్రీ కూతుర్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ అండ్ రొమాంటిక్ రాబోతున్నాడు నాని. మరోవైపు యంగ్ హీరో నితిన్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీతో ఎలాగైనా ఈసారి తన ఖాతాలో హిట్ పడాలని కోరుకుంటున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ అండ్ కామెడీ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇద్దరూ ఒకరోజు తేడాతో థియేటర్లలోకి రాబోతున్నప్పటికీ, జోనర్లు వేరు వేరు కావడంతో ఎవరికి వారే మూవీ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.

- Advertisement -

అయితే వీరి నమ్మకం సంగతి ఎలా ఉన్నా ఈ రెండు సినిమాలకు “యానిమల్” మూవీ గండంగా మారింది. యూఎస్ తో పాటు తెలుగు స్టేట్స్ లోని కొన్ని ఏరియాల్లో కూడా “హాయ్ నాన్న”, “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాలపై “యానిమల్” మూవీ డామినేషన్ ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ అదే గనక నిజమైతే ఈ రెండు సినిమాల కలెక్షన్లపై “యానిమల్” మూవీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.. మరి నాని, నితిన్ సినిమాలు ‘యానిమల్’ మూవీ సునామీని తట్టుకొని నిలబడగలవా లేదా అనేది తెలియాలంటే రేపటి దాకా ఎదురు చూడక తప్పదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు