Hi Nanna: డైరెక్టర్‌తో నాని విభేదాలు…? అందుకే సినిమా ఆలస్యం

ఈ వారం సిల్వర్ స్క్రిన్ పై రావడానికి సిద్ధమైవుతుంది హాయ్ నాన్న. నాని హీరోగా వస్తున్న ఈ సినిమాను శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడన్న సంగతి తెలిసిందే. వైరా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి నిర్మించారు. డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒక ఫీల్ గుడ్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

ఇక సినిమా రిలీజ్ కి దగ్గరవుతున్న సమయంలో హాయ్ నాన్న సినిమా డైరెక్టర్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. అదేంటంటే హాయ్ నాన్న సినిమా నాలుగు నెలల ముందే పూర్తయిందట. కానీ సినిమా స్కిప్ట్ లో కొన్ని సీన్లు నాని కి నచ్చలేదని ఆ సీన్లు చేంజ్ చేయాలని శౌర్యువ్ కి నాని ప్రొడ్యూసర్ ద్వారా చెప్పించారట. దానికి డైరెక్టర్ ససేమిరా అన్నాడట. తన స్టోరీ లో ఎవరు ఇన్వాల్వ్ అయినా తాను సహించలేనని స్క్రిప్ట్ లో ఛేంజస్ చేయడం కుదరదు అని తేల్చి చెప్పాడట.

దాంతో కొంత మేర షూట్ మిగిలి ఉండగా సడన్ గా షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందట. ఆ తర్వాత నిర్మాతలు ఇద్దర్ని కన్విన్స్ చేసి ఒక్క మాట మీద సినిమాలో చిన్న పాటి ఛేంజెస్ చేయించి రెడీ చేయించారని తెలుస్తుంది. ఈ విషయాన్నీ డైరెక్టర్ తన సన్నిహితులతో మాత్రమే చెప్పుకున్నాడని తెలుస్తుంది. ఆ విషయం ఇలా సోషల్ మీడియా లో స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు సినిమా పరంగా ఏ ఇష్యూలు లేవని, హాయ్ నాన్న రిలీజ్ తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ న్యూస్ ఎంత వరకు నిజమో మేకర్స్ నుండి క్లారిటీ వస్తేనే తెలుస్తుంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు