Nani: హాయ్ నాన్న బిజినెస్… వంద కోట్ల సినిమా తర్వాత కూడా ఏంటిది?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ లవ్ స్టోరీ గా రానున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. వైరా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాను శౌర్యువ్ దర్శకత్వం వహించాడు.

ఇక హాయ్ నాన్న సినిమా యొక్క థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా డీసెంట్ బిజినెస్ ని జరుపుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏరియాల వారీగా.. నైజాం: 8.50Cr ,సీడెడ్: 2.60Cr, ఆంధ్ర: 9CR మొత్తంగా రెండు స్టేట్స్ కలిపి 20.10 కోట్ల లోపే బిజినెస్ ఎండ్ చేసేసారు. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 2కోట్లు, ఓవర్సీస్ లో 5.50 కోట్లు జరగగా వరల్డ్ వైడ్ గా హాయ్ నాన్న 27.60 కోట్ల బిజినెస్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఇతర భాషల్లో పెద్దగా బిజినెస్ కాలేదు.

అయితే నాని రీసెంట్ గా నటించిన దసరా సినిమాకి దాదాపు 50 కోట్లకి పైనా బిజినెస్ చేసింది. ఇక రిలీజ్ తర్వాత దసరా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దాదాపు 115 కోట్లకి పైగా వసూలు చేసి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటిది అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత నాని సినిమాకి యావరేజ్ బిజినెస్ జరగడం అంటే ఇది నాని రేంజ్ కి తక్కువనే చెప్పాలి. అయితే హాయ్ నాన్న ఒక క్లాస్ సినిమా కాబట్టి దసరా తో పోల్చలేం. అందుకే ఇక్కడ తక్కువే జరిగినా ఓవర్సీస్ లో బిజినెస్ మాత్రం కుమ్మింది.

- Advertisement -

పైగా హాయ్ నాన్న కి పోటీగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రిలీజ్ అవుతుంది కాబట్టి, బిజినెస్ లో కొంత తగ్గిందని చెప్పొచ్చు. అయితే హాయ్ నాన్న కి పాజిటివ్ టాక్ గనుక వస్తే వారంలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి థియేటర్లో హాయ్ నాన్న ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు