Bollywood: ఆ సిరీస్ వల్ల తమన్నా ని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నా భాటియా. టాలీవుడ్ టాప్ హీరోలందరితోను జత కట్టిన ఈ భామ బాలీవుడ్ పై మక్కువ తో ఇక్కడి ఆఫర్లను రిజెక్ట్ చేసి మరీ వెళ్ళింది. అయితే అక్కడ అంతగా ఆదరణ లేకపోవడంతో మళ్ళీ టాలీవుడ్ బాట పట్టింది. అయితే అప్పటికే టాలీవుడ్ లో క్రేజ్ కోల్పోయిన తమన్నా ఇప్పుడు ఆఫర్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. టాప్ హీరోల సినిమాల్లో ఒక్క ఆఫర్ కూడా రావట్లేదు. ఎదో మెగాస్టార్ భోళా శంకర్ లో హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ఆ సినిమా వల్ల తమన్నా కి ఒరిగేదేమి లేదు.

అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ సిక్వెల్ లో నటించింది ఈ భామ. ఆ సిరీస్ లో తమన్నా కొన్ని బోల్డ్ సీన్లలో నటించినందుకు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ అయితే ఆమెని ఏకిపారేస్తున్నారు. లస్ట్ స్టోరీ లో అలాంటి దారుణమైన సీన్లో నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని, డీసెంట్ గా పద్ధతిగా ఉంటే తెలుగులో ఎప్పటికైనా ఆఫర్లు వచ్చేవని నెటిజన్లు అంటున్నారు.

ఈ వారమే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన లస్ట్ స్టోరీస్ మంచి వ్యూస్ ని సొంత చేసుకుంటున్నా ఈ సిరీస్ లో నటించినందుకు తమన్నా ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పటికే యంగ్ హీరోలతో ఆఫర్లు రాక సీనియర్ హీరోలతో నటించాల్సి వస్తుంది తమన్నాకి. ఇక ఈ సినిమాతో సీనియర్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్సులు రావని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి తమన్నా లస్ట్ స్టోరీస్ వల్ల జరిగిన డ్యామేజ్ ని ఎలా సరిదిద్దుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు