Saamajavaragamana: ఫస్ట్ మూవీతోనే హిట్టు కొట్టేసిన మోనిక.. మిగిలింది ఆ అమ్మాయే

టాలీవుడ్ లో ఈ వారం అరడజను కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అందులో మంచి అంచనాలతో విడుదలైన క్రేజీ సినిమాల్లో ఒకటి సామజవరగమన కాగా, మరొకటి “స్పై”. జూన్ 29న విడుదలైన ఈ రెండు సినిమాల్లో “సామజవరగమన” యనానిమస్ గా క్లీన్ హిట్ టాక్ తెచ్చుకోగా “స్పై” మిక్సడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాల సక్సెస్ లు ఈ సినిమాల్లో నటించిన ఇద్దరు హీరోయిన్లకు కీలకంగా మారింది. అందులో ఒకరు సక్సెస్ అయ్యారు. మరొకరు పెండింగ్ లో ఉన్నారు.

వారిలో ముందుగా చెప్పాల్సింది రెబ మోనికా జాన్. కేరళకి చెందిన ఈ బ్యూటీ పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించగా తెలుగులో సామజవరగమన సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ముందుగా ఏ అంచనాలు లేని ఈ సినిమా ఇప్పుడు మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుని హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇక హీరోయిన్ రెబ మోనికా మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం విశేషం. ఇక ముందు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తాయని చెప్పవచ్చు.

ఇక మరో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కి కూడా “స్పై” విజయం కీలకంగా మారింది. చెన్నై కి చెందిన ఈ హీరోయిన్ కూడా తెలుగులో మొదటిసారి నటించింది. ఇక ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కించుకున్నా కూడా “స్పై” సినిమా భారీ ఓపెనింగ్స్ నే దక్కించుకుంది. కాకపోతే ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూస్తే గాని క్లారిటీ రాదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు