NBK109: నాని కోసం ఎదురుచూస్తున్న బాలయ్య..!

బాలక్రిష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత బాబీ ఈ సినిమా అనౌన్స్ చేయటంతో ఆసక్తి నెలకొంది. అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే హీట్ పెంచిన ఈ సినిమా షూటింగ్ నవంబర్ 4న స్టార్ట్ అవ్వనుందని సమాచారం.

డైరెక్టర్ బాబీ ఈ సినిమాను కూడా వాల్తేరు వీరయ్య తరహాలోనే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణతో పాటు ఒక యంగ్ హీరోకి కూడా ఇంపార్టెంట్ రోల్ ఉందని, ఆ రోల్ కోసం ముందుగా డుల్కర్ సల్మాన్ ని సంప్రదించగా అప్పటికే సూర్య సినిమా కమిట్ అవ్వటంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వవని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ రోల్ కి హీరో నాని అయితే పర్ఫెక్ట్ గా  సెట్ అవుతాడని బాబీ భావిస్తున్నాడట. నాని డేట్స్ దొరకటం కూడా కష్టమే అయినప్పటికీ గట్టిగా ట్రై చేస్తున్నాడట. ఒకవేళ నాని డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోతే వేరొక యంగ్ హీరోను తీసుకునే అవకాశం ఉంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాలో బాలయ్య వీరాభిమానిగా నటించి సక్సెస్ అందుకున్నాడు నాని. ఇప్పుడు బాలకృష్ణతో కలిసి నాని సినిమా చేస్తే ఫ్యాన్స్ కి ఇంతకు మించిన సెలెబ్రేషన్ ఉండదనే చెప్పాలి.

- Advertisement -

వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ చిరుని చూపించటంలో సక్సెస్ అయిన బాబీ ఈ సినిమాలో బాలక్రిష్ణను కూడా అదే రేంజ్ లో చూపిస్తాడని ఆశిస్తున్నారు. ప్రపంచానికి అతను తెలుసు కానీ, అతని ప్రపంచం ఎవరికీ తెలీదు అన్న ట్యాగ్ లైన్ ఇంట్రస్ట్ పెంచిన ఈ సినిమా బాలయ్యకి ఇంకో బ్లాక్ బస్టర్ అందిస్తుందా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు